మీరు లాప్‌టాప్‌తో విమానాశ్రయానికి వెళుతున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
విమానాశ్రయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ తనిఖీల్లో సిబ్బంది "బ్యాగులోంచి ల్యాప్‌టాప్‌లు బయటకు తీయండి" అని చెప్పడం, మనం కాస్త చిరాకుగా దాన్ని బయటకు తీసి ట్రేలో పెట్టడం సాధారణం. అయితే, ఈ చిన్నపాటి అసౌకర్యం వెనుక ప్రయాణికుల భద్రతకు సంబంధించిన బలమైన కారణాలున్నాయి. ఇది కేవలం సమయం వృధా చేసే ప్రక్రియ కాదు, ప్రతి విమాన ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి తీసుకుంటున్న కేర్.
ల్యాప్‌టాప్‌ల లోపల ఉండే బ్యాటరీ, మెటల్ భాగాలు మందంగా ఉంటాయి. స్మగ్లర్లు ల్యాప్‌టాప్ కేసింగ్‌లలో డ్రగ్స్ లాంటివి దాచిపెట్టే ప్రమాదం ఉంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలు ల్యాప్‌టాప్‌లను విడిగా స్కాన్ చేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీ అత్యంత శక్తివంతమైనవి. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఆ బ్యాటరీ పాడై వేడెక్కి మంటలు చెలరేగితే? ల్యాప్‌టాప్‌ను విడిగా స్కాన్ చేసినప్పుడు, దాని బ్యాటరీ పరిస్థితిని అంచనా వేయడానికి భద్రతా సిబ్బందికి సులువుగా ఉంటుంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తదుపరి పరీక్షలకు పంపుతారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని విమానాశ్రయాల్లో అత్యాధునిక 3డీ స్కానర్లను వాడుతున్నారు. వీటి ద్వారా ల్యాప్‌టాప్‌లను బయటకు తీయకుండానే తనిఖీ చేయవచ్చు. అయితే, ప్రపంచంలోని చాలా విమానాశ్రయాల్లో ఇప్పటికీ పాతతరం ఎక్స్-రే మెషీన్లే వాడుకలో ఉన్నాయి. కాబట్టి, ఈ టెక్నాలజీ అంతటా అందుబాటులోకి వచ్చే వరకు, ప్రయాణికులు ఈ భద్రతా నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘పని మనిషి చేతిలో మోసపోయా..’ ప్రసాద్ ఎమోషనల్
హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్
అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్
Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య
Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

