Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు
దీపావళి పండగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వెలుగులతో, టపాకాయలతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా దీపావళి పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినీ తారల దీపావళి సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే స్టార్ హీరోయిన్ సమంత పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దర్శకుడు రాజ్ తో కలిసి సమంత దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా సమంత రాజ్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు దీవాళీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో సామ్, రాజ్ రిలేషన్ పై అభిమానుల అనుమానాలకు మరింత బలం చేకూరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్

