AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi’s Mission: ప్రఖ్యాత రచయిత బెర్జిస్ దేశాయ్ రాసిన పుస్తకం.. ఆవిష్కరణ ఎప్పుడంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం, రాజకీయ ప్రయాణం గురించి వివరిస్తూ ప్రఖ్యాత న్యాయవాది బెర్జిస్ దేశాయ్ రచించిన ‘మోడీస్ మిషన్’ అనే కొత్త పుస్తకాన్ని 24 అక్టోబర్ మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గౌరవనీయులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ఆ విష్కరించనున్నారు. రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకలో బెర్జిన్‌ దేశాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన బాల్యం నుండి ప్రధాని పీఠాన్ని అధిష్టించే వరకు చేసిన అసాధారణ వ్యక్తిగత ప్రయాణాన్ని ఎంతో చక్కగా వివరించారు.

Modi's Mission: ప్రఖ్యాత రచయిత బెర్జిస్ దేశాయ్ రాసిన పుస్తకం.. ఆవిష్కరణ ఎప్పుడంటే?
Narendra Modi Biography
Anand T
|

Updated on: Oct 23, 2025 | 1:40 PM

Share

తన బాల్యం నుంచి ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు నరేంద్ర మోదీ చేసిన అసాధారణ వ్యక్తిగత ప్రయాణాన్ని వివరిస్తూ ప్రఖ్యాత న్యాయవాది బెర్జిస్ దేశాయ్ రచించిన ‘మోడీస్ మిషన్’ అనే కొత్త పుస్తకం అవిష్కరణకు సిద్దమైంది. 24 అక్టోబర్ మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గౌరవనీయులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మోదీస్ మిషన్ అనేది జీవిత చరిత్ర కాదని.. ఇది ఒక ఆలోచన యొక్క కథ అని ఆయన వివరించారు. అధిగమించలేని అడ్డంకులు, అసంఖ్యాక సవాళ్లు ఉన్నప్పటికీ జాతీయ మేల్కొలుపు సాధనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదిగిన తీరును రచయిత బెర్జిస్ దేశాయ్ ఈ పుస్తకంలో ఎంతో చక్కగా వివరించారు.

ఈ పుస్తకం ప్రధానమంత్రి మోదీ బాల్యం నుండి ఆయన సామాజిక ఆర్థిక తత్వాన్ని, పాలనపై ఆయన దృక్పథాన్ని రూపొందించిన అనుభవాలను తెలియజేస్తుంది. భారతదేశంలోని మేధావి వర్గంలో ఒక వర్గం ప్రధాని మోడీ పాలనను పక్కదారి పట్టించేలా ప్రచారం చేస్తున్న అబద్ధాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. ప్రధాని మోదీ భారతదేశం సమిష్టి చైతన్యాన్ని పెంచారని, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత పాలనను నిర్ధారించారని బెర్జిస్ దేశాయ్ పరిశీలించారు. భారత ఆర్థిక వ్యవస్థను అధికారికీకరించడం నుండి ఆర్టికల్ 370 రద్దు వరకు, ఈ పుస్తకం చిరస్మరణీయ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాని మోదీ పద్దతి విధానాన్ని వివరిస్తుంది. భారతదేశ నాగరికత గర్వాన్ని బలోపేతం చేయడానికి, సమర్థవంతమైన సంక్షేమ రాజ్యాన్ని సృష్టించడానికి ప్రధాని మోదీ నిర్ణయాలు ఎలా ఉపయోగపడ్డాయో రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించారు.

ఇంతకు ఎవరు ఈ బెర్జిస్ దేశాయ్

రచయిత బెర్జిస్ దేశాయ్ ముంబైకి చెందిన న్యాయవాది. ఈయన ప్రముఖ గుజరాతీ దినపత్రికతో జర్నలిస్ట్ గా పనిచేశారు. భారతదేశంలోని ప్రముఖ న్యాయ సంస్థలలో ఒకదానికి మేనేజింగ్ పార్టనర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. పార్సీ సంస్కృతిపై విమర్శకుల ప్రశంసలు పొందిన ఓహ్! దోస్ పార్సిస్, ది బవాజీతో సహా బెర్జిస్ వంటి అనేక పుస్తకాలను ఈయన రచించారు.

ఆనంద్ మహింద్రా ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ ఎదుగుదలను వివరిస్తూ బెర్జిస్ దేశాయ్ రాసిన ఈ పుస్తకంపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి మోదీ 21వ శతాబ్దంలో అత్యంత నిశితంగా పరిశీలించబడిన నాయకులలో ఒకరని ఆయన అన్నారు. మన దేశం పట్ల ఆయనకున్న స్పష్టమైన ప్రేమతో, ప్రపంచంలో భారత దేశ స్థానాన్ని టాప్‌లోకి తెచ్చేందుకు ఆయన ఎంత శ్రమించారో ఈ పుస్తకం విశ్లేషిస్తుందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.