Ashok Gehlot: ముఖ్యమంత్రులను వెంటాడుతున్న కరోనా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌కు పాజిటివ్..

Rajasthan CM Ashok Gehlot: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ

Ashok Gehlot: ముఖ్యమంత్రులను వెంటాడుతున్న కరోనా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌కు పాజిటివ్..
Ashok Gehlot
Follow us

|

Updated on: Apr 29, 2021 | 11:05 AM

Rajasthan CM Ashok Gehlot: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు వరకూ అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు క‌రోనా సోకింది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేసి స్వయంగా వెల్లడించారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా ఉన్నాన‌ంటూ ఆయన వెల్లడించారు. త‌న‌కు ఎలాంటి క‌రోనా లక్ష‌ణాలు లేవ‌ని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని ట్విట్ చేశారు.

కాగా… గెహ్లాట్ భార్య సునీత‌కు బుధ‌వారం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ కూడా కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో గెహ్లాట్ కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. కాగా.. తాను కరోనా బారిన పడినప్పటికీ.. రాష్ట్రంలో కోవిడ్ -19 ప‌రిస్థితుల‌కు సంబంధించి ప్ర‌తి రోజు రాత్రి 8:30 గంట‌ల‌కు డాక్ట‌ర్ల‌తో, అధికారులతో స‌మీక్ష జ‌రుపుతాన‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలాఉంటే.. రాజస్థాన్‌లో బుధవారం 16,613 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 120 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3,926 మంది మరణించగా.. 5,63,577 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,63,372 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ వెండితెరకు దూరమై నేటికి ఏడాది… తండ్రి చివరి మాటలను గుర్తుచేసుకున్న తనయుడు..

Vivo v21 5g: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త.. నేడే వివో వి21 5జీ మొబైల్ లాంచ్.. అద్భుతమైన ఫీచర్స్..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే