Villagers Beaten: షాప్ ముందు కూర్చొని యువతీ యువకుడు ముచ్చట్లు.. ఆగ్రహించిన స్థానికులు వారిని ఏం చేశారంటే..
Villagers Beaten: ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగానే కాదు.. దేశంలోనూ ఆడ, మగ అనే తేడా దాదాపు తగ్గిపోయిందనడంలో...
Villagers Beaten: ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగానే కాదు.. దేశంలోనూ ఆడ, మగ అనే తేడా దాదాపు తగ్గిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే సమయంలో మనదేశంలో గ్రామీణ స్థాయిలో మాత్రం ఈ వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంటుంది. పొరపాటున ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకున్నారంటే చాలు.. ఇక అంతేసంగతులు. పది మంది పది రకాలు అనుకోవడమే కాకుండా అడ్డమైన పుకార్లు సృస్టించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే.. పైన చెప్పుకున్నదానికి నిదర్శనమైన ఘటన తాజాగా రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఓ యువతి, యువకుడు మాట్లాడుంటుండగా ఆగ్రహించిన స్థానికులు వారిద్దరినీ చావబాదారు. వివరాల్లోకెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ కిరాణా షాపు ముందు కూర్చొని యువతీ యువకుడు ముచ్చటించుకుంటున్నారు.
కాసేపు వారిద్దరినీ గమనించిన స్థానికులు.. ఆ తరువాత ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడితో మాట్లాడుతావా? అంటూ యువతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. అయితే, యువతిని స్థానికులు కొడుతున్న సందర్భంగా కొందరు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రజా సంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. యువతిపై దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.