AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరో 22 హోలీ ప్రత్యేక రైళ్లు

Railway Passengers Alert: హోలీ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు ప్రయాణీకుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల వివిధ ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. ఇప్పుడు మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే శాఖ.

Holi Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. మరో 22 హోలీ ప్రత్యేక రైళ్లు
Holi Special Trains
Janardhan Veluru
|

Updated on: Mar 06, 2025 | 5:23 PM

Share

సికింద్రాబాద్, 06 మార్చి 2025: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు అదనంగా ఇప్పుడు మరో 22 హోలీ ప్రత్యేక రైళ్లను (Holi Special Trains) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. మార్చి 7 తేదీ నుంచి 18వ తేదీకి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

12 హోలీ ప్రత్యేక రైళ్ల వివరాలు..

  1. ప్రత్యేక రైలు నెం.06055 పోదనూర్ నుంచి మార్చి 8, 15 తేదీలలో ఉదయం 11.45 గంటలకు బయలుదేరి 2వ రోజు మధ్యాహ్నం 02.30 గంటలకు బరౌని చేరుకుంటుంది.
  2. ప్రత్యేక రైలు నెం. 06056 బరౌని నుంచి మార్చి 11, 18 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి 2వ రోజు రాత్రి 11.45 గంటలకు పోదనూర్ చేరుకుంటుంది.
  3. ప్రత్యేక రైలు నెం.06073 మార్చి 7, 14 తేదీల్లో మధ్యాహ్నం 02.15 గంటలకు తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరి 2వ రోజు రాత్రి 08.20 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
  4. ప్రత్యేక రైలు నెం.06074 మార్చి 10, 17 తేదీల్లో ఉదయం 04.10 గంటలకు నిజాముద్దీన్ నుంచి బయలుదేరి 2వ రోజు మధ్యాహ్నం 02.15 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది.
  5. ప్రత్యేక రైలు నెం. 06077 మార్చి 8, 12వ తేదీల్లో రాత్రి 11.45 గంటల నుంచి చెన్నై నుంచి బయలుదేరి 2వ రోజు ఉదయం 07.15 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది.
  6. ప్రత్యేక రైలు నెం. 06078 మార్చి 10, 14 తేదీల్లో ఉదయం 09.00 గంటలకు సంత్రాగచి నుంచి బయలుదేరి మరుసటి రోజు 03.30 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

1. రైలు నెం. 06055/06056 పోదనూర్ – బరౌని – పోదనూర్ ప్రత్యేక రైళ్లు:

ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ, టిట్లాగఢ్, సంబల్పూర్, ఝార్సుగూడ, రూర్కెలా, నువాగావ్, హతియా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, బరాకర్, చిత్తరంజన్, మధుపూర్, జసిదిహ్, ఝా, కియుల్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.

2. రైలు నెం. 06073/06074 తిరువనంతపురం నార్త్ – నిజాముద్దీన్ – తిరువనంతపురం నార్త్ ప్రత్యేక రైళ్లు:

ఈ ప్రత్యేక రైళ్లు కొల్లం, కాయంకుళం, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిస్సూర్, పాల్ఘాట్, పోదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, బల్హర్షా, నాగ్‌పూర్, రాణి కమలాపతి, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.

3. రైలు నెం. 06077/06078 చెన్నై సెంట్రల్ – సంత్రాగచి – చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైళ్లు:

ఈ ప్రత్యేక రైళ్లు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి.

అదనంగా మరో 10 ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు

అలాగే చర్లపల్లి – ధనపూర్, చర్లపల్లి – ముజఫర్‌పూర్ మధ్య హోలీ సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు