AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్రాస్ ఐఐటీ వారి కొత్త ఆవిష్కరణ.. ఎలాంటి మిసైల్స్ అయినా సరే.. దీని ముందు జుజుబీ..!

మద్రాస్ ఐఐటి సరికొత్త సాంకేతికతతో ఈ ఫ్రేమ్‌వర్క్ డిజైనర్లు రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ (RC) ప్యానెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మిస్సైల్స్ ప్రయోగించిన ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఉండేలా గోడల నిర్మాణానికి సంబంధించిన టెక్నాలజీని రూపొందించింది. మద్రాస్ ఐఐటీలో పరిశోధక విభాగంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన అలగప్పన్ ఈ తరహా గోడలను రూపొందించే పనిలో ఉన్నారు.

మద్రాస్ ఐఐటీ వారి కొత్త ఆవిష్కరణ.. ఎలాంటి మిసైల్స్ అయినా సరే.. దీని ముందు జుజుబీ..!
Iit Madras
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 06, 2025 | 6:15 PM

Share

మద్రాస్ ఐఐటి సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలకు సైతం సాధ్యం కాని కొత్త తరహా సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో తనదైన ముద్ర వేస్తోంది. హైపర్ లూప్ టెక్నాలజీలో భారత్ సాధించిన ఘనత ఏంటో ఇటీవల చూశా.. టెక్నాలజీ రంగంలో అందరికన్నా ముందుండే హెలెన్ మాస్క్ దృష్టి పెట్టిన హైపర్ లూప్ ట్యూబ్ ద్వారా ట్రైన్స్ నడపడం ద్వారా అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చవచ్చు. మద్రాస్ ఐఐటీ ఈ తరహా ప్రయోగాల్లో ఇటీవల ప్రాథమికంగా సక్సెస్ చేసి చూపింది.

తాజాగా దేశ రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. ప్రపంచ దేశాలకు సైతం సాధ్యం కానీ ఇలాంటి కొత్త తరహా ఆవిష్కరణలతో శత్రు దేశాలకు వణుకు పుట్టేలా చేస్తోంది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాలపై ట్యాంకర్లతో చేసే దాడుల కంటే ఈ మిస్సెల్స్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంటాయి. బాలిస్టిక్ క్షిపణులు తరచుగా మౌలిక సదుపాయాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. బాలిస్టిక్ నిరోధకతను మెరుగుపరచడానికి కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసింది మద్రాస్ ఐఐటీ. భారీ నిర్మాణాలు సైతం నేలకూలుతాయి.

అందులోనూ భద్రత రంగానికి సంబంధించిన సంస్థలు, దేశ రాజ్యాంగ పదవుల్లో కీలకంగా ఉన్న భవనాలకు రక్షణ కల్పించడం అనేది అత్యంత క్లిష్టతరంగా మారుతుంది. అలాంటి వాటిని తట్టుకుని దీటుగా నిలబడేలా సరికొత్త టెక్నాలజీని మద్రాస్ ఐఐటి రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన గోడల నిర్మాణాలు, ఇంకా చెప్పాలంటే శత్రుదుర్బేధ్యమైన గోడలు అని కూడా చెప్పొచ్చు. పూర్వం రాజుల పరిపాలనలో రాజ్యాన్ని పాలించే కోట చుట్టూ శత్రువులు చొరపడకుండా ఉండేందుకు అత్యంత ఎత్తైన ప్రాకారాలను నిర్మించేవారు. వాటిని దాటుకుని రావడం అప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు మిస్సైల్ లాంటి పెద్ద పరికరాలు అందుబాటులోకి వచ్చాక,అలాంటి ఎత్తైన ప్రాకారాలు వాటిని ఆపగలిగే పరిస్థితి లేదు.

ఇందు కోసమే మద్రాస్ ఐఐటి సరికొత్త సాంకేతికతతో ఈ ఫ్రేమ్‌వర్క్ డిజైనర్లు రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ (RC) ప్యానెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మిస్సైల్స్ ప్రయోగించిన ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఉండేలా గోడల నిర్మాణానికి సంబంధించిన టెక్నాలజీని రూపొందించింది. మద్రాస్ ఐఐటీలో పరిశోధక విభాగంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన అలగప్పన్ ఈ తరహా గోడలను రూపొందించే పనిలో ఉన్నారు. కంప్యుటేషనల్ సిమ్యులేషన్స్ ఉపయోగించి, పరిశోధకులు RC పై క్షిపణుల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇది సైనిక బంకర్లు, అణు విద్యుత్ భవనాలు, వంతెనల నుండి రన్‌వేల వరకు కీలకమైన నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగించే ప్రధాన పదార్థం. నేటి అనూహ్య ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించే కాంక్రీట్ నిర్మాణాలకు బాలిస్టిక్ డిజైన్ ముఖ్యమైనదని అంటున్నారు.

“ఈ నిర్మాణాల వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా, శిధిలాల ప్రభావం నుండి రక్షించడం చాలా అవసరం. దీని ఫలితంగా స్థానికంగా నష్టం జరగవచ్చు. మొత్తం నిర్మాణం కూలిపోవచ్చు. అందుకే ప్రయోగాత్మక ప్రవేశపెడుతున్నట్లు” ఐఐటి మద్రాస్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అలగప్పన్ పొన్నల్గు అన్నారు.

ఎంత లోతు గొయ్యి ఏర్పడుతుందో పరిశీలించి తద్వారా వాటిని తట్టుకునేలా అందుకు తగ్గ సామర్థ్యం, వాటికి తగ్గ మెటీరియల్ తో పెద్దపెద్ద షీట్లను తయారుచేసి వాటిని కాంపౌండ్ వాల్ లాగా లేదా భవనాలకు సేఫ్టీ షీట్స్ లాగా ఉండేలా రూపొందించే ప్రక్రియ కోసం పరిశోధనలు చేస్తున్నట్టు మద్రాస్ ఐఐటి పరిశోధన విభాగం తెలిపింది. ఇలా తయారుచేసిన టెక్నాలజి తో తయారుచేసిన ఇలాంటి గోడలు లేదా ఇలాంటి షీట్స్‌ను మన దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల బంకర్ల పైకప్పు విభాగానికి అమర్చేల ఏర్పాట్లు చేపట్టనున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..