AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao: ఒకే డ్రెస్‌తో 30 సార్లు దుబాయ్ ట్రిప్.. రన్యా రావు ఎలా దొరికిపోయిందో తెలుసా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన DRI అధికారులు.. నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. సుధీర్ఘ వాదనల అనంతరం కస్టడీపై తీర్పును న్యాయస్థానం రేపటికి రిజర్వ్‌ చేసింది.

Ranya Rao: ఒకే డ్రెస్‌తో 30 సార్లు దుబాయ్ ట్రిప్.. రన్యా రావు ఎలా దొరికిపోయిందో తెలుసా..?
Ranya Rao
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2025 | 5:02 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన DRI అధికారులు.. నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. సుధీర్ఘ వాదనల అనంతరం కస్టడీపై తీర్పును న్యాయస్థానం రేపటికి రిజర్వ్‌ చేసింది. అయితే.. రన్యా రావు 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని DRI అధికారులు కోర్టుకు తెలిపారు. ప్రతి సారి ఒకే డ్రెస్‌తోనే ఆమె దుబాయ్‌ వెళ్లారని, అందులోనే గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేశారన్నారు. ఇలా వెళ్లి.. ఒక్కో ట్రిప్ కు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. కన్నడ నటి రన్యారావు ఒకే డ్రెస్ లో కేజీల కొద్ది బంగారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడం సంచలనంగా మారింది. పట్టుబడ్డ క్రమంలో 15 కేజీల బంగారాన్ని రన్యారావు ఎలా ట్రాన్స్ పోర్ట్ చేసిందో అధికారులు కోర్టుకు వివరించారు. ఆమె వేసుకున్న జాకెట్ లోపలి భాగంలో కొంత, బెల్ట్ రూపంలో కడ్డీలుగా దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత బంగారం ఉన్నా సెక్యూరిటీ సిస్టమ్ గుర్తించలేకపోవడం పై అధికారులు విచారణను ముమ్మరం చేశారు. రన్యారావు డీజీపీ సంబంధీకులు కావడం, కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ సిస్టమ్ ను తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ముందస్తు సమాచారం ఉండటంలో DRI పోలీసులకు రన్యారావు దొరక్కతప్పలేదని పేర్కొంటున్నారు.

అయితే.. తాను బంగారం తీసుకురావడం ఇదే తొలిసారి అని నటి రన్యా రావు దర్యాప్తు అధికారులకు తెలిపింది. ఈ పని చేయమని తనను బెదిరిస్తున్నారని ఆ నటి చెప్పినట్లు సమచారం..

స్పందించిన రన్యారావు తండ్రి..

ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని రన్యారావు సవతి తండ్రి, డీజీపీ రామచంద్రారావు చెబుతున్నారు. తన కెరీర్‌లో మచ్చలేదని ఆయన చెబుతున్నారు. కానీ రామచంద్రారావు కూడా గతంలో పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. 2014 హవాలా కేసులో రామచంద్రారావుపై ఆరోపణలు వచ్చాయి. కేరళ వ్యాపారవేత్త నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఆయన ఇరుక్కున్నారు. అప్పుడు రామచంద్రారావు ఐజీగా ఉన్నారు. 2 కోట్ల నగదు సీజ్‌ చేసి 20 లక్షల సొమ్మును మాత్రమే చూపించడంతో రామచంద్రారావును ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

రన్యాపై అభియోగాలివే..

ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించిన రన్యా రావు గత ఏడాది కాలంలో 30 సార్లు దుబాయ్ వెళ్లి భారీ మొత్తంలో బంగారాన్ని తిరిగి తీసుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆ నటికి కిలో అక్రమంగా తరలించిన బంగారానికి లక్ష రూపాయలు చెల్లించారు. ఆ విధంగా, ఆమె ఒక్కో ట్రిప్‌కు దాదాపు 12-13 లక్షలు సంపాదించిందని ఆరోపించారు.

విమానాశ్రయ భద్రతను తప్పించుకోవడానికి రావు బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి మోడిఫైడ్ జాకెట్లు – నడుము బెల్టులను ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

గత కొన్ని వారాలుగా, నటి తరచుగా దుబాయ్ సందర్శనల కారణంగా ఆమెపై నిఘా ఉంచారు. విమానాశ్రయంలోని ఒక పోలీసు కానిస్టేబుల్ భద్రతా తనిఖీలను దాటవేయడానికి రన్యాకు సహాయం చేశాడని వర్గాలు తెలిపాయి.

రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు – పోలీసు అధికారులతో సహా పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో రన్యాకు సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.