Railway Passenger Alert: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ 12 రైళ్లు రద్దయ్యాయి.. చెక్ చేసుకోండి

Railway News: సెంట్రల్ రైల్వే(Central Railway) పరిధిలోని అంకై కిల్లా, మన్మాడ్ రైల్వే స్టేషన్లలో యార్డ్ రీమోడలింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ కారణంగా అటు వైపుగా నడిచే 10 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

Railway Passenger Alert: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ 12 రైళ్లు రద్దయ్యాయి.. చెక్ చేసుకోండి
Indian Railways
Follow us

|

Updated on: Jun 24, 2022 | 4:50 PM

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. సాంకేతిక కారణాలతో కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. రద్దైన ఈ రైళ్ల  వివరాలను రైల్వే శాఖ మీడియాకు వెళ్లడించింది.  సెంట్రల్ రైల్వే(Central Railway) పరిధిలోని అంకై కిల్లా, మన్మాడ్ రైల్వే స్టేషన్లలో యార్డ్ రీమోడలింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ కారణంగా అటు వైపుగా నడిచే 10 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. రద్దైన రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. జూన్ 25 నుంచి 28వ తేదీ వరకు దౌండ్-నిజామాబాద్(రైలు నెం.11409) రైలును రద్దు చేశారు. అలాగే నిజామాబాద్ – పూణె రైలు (నెం.11410) జూన్ 24 నుంచి 27 తేదీ వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్ – ముంబై CST రైలు (నెం.17058)ను జూన్ 25, 27 తేదీల్లో రద్దు చేశారు. ముంబై CST – సికింద్రాబాద్ రైలు (నెం.17057)ను జూన్ 26, జూన్ 28 తేదీల్లో రద్దు చేశారు. అలాగే హదాప్సర్ – H.S నాందేడ్ రైలు (నెం.12729)ను జూన్ 27న రద్దు చేయగా.. H.S.నాందేడ్ – హదాప్సర్ రైలు(నెం.12730)ను జూన్ 26వ తేదీ రద్దు చేశారు.

ముంబై CST-H.S.నాందేడ్ రైలు (నెం.17612)ను జూన్ 27, 28 తేదీల్లో రద్దు చేయగా.. H.S.నాందేడ్ -ముంబై CST రైలు (నెం.17611)ను జూన్ 26, 27 తేదీల్లో రద్దు చేశారు. అలాగే నిజామాబాద్-పండార్‌పూర్ రైలు (నెం.01413)ను ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రద్దు చేయగా.. పండారిపూర్ – నిజామాబాద్ రైలు (నెం.01414)ను ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా రద్దైన రైళ్ల వివరాలు..

ఇవి కూడా చదవండి
Railway News

Railway News

విజయవాడ డివిజన్‌లో ఆ రైళ్లు రద్దు..

అలాగే విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దు చేయగా.. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం రైలు (నెం.17267)ను జూన్ 26న రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ రైలు (నెం.17268) రైలును జూన్ 26న రద్దు చేశారు.

కాకినాడ పోర్ట్ – విజయవాడ రైలు (నెం.17258)ను జూన్ 26న కాకినాడ పోర్ట్ నుంచి రాజమండ్రి వరకు పాక్షికంగా రద్దు చేశారు. అలాగే విజయవాడ – కాకినాడ పోర్ట్ రైలు (నెం.17257)ను జూన్ 26న రాజమండ్రి నుంచి కాకినాడ పోర్ట్ వరకు పాక్షికంగా రద్దు చేశారు. ఈ రెండు రైళ్లు ఆ రెండు రోజుల్లో రాజమండ్రి – విజయవాడ మధ్య మాత్రమే నడుస్తాయి.

Railway News2

Railway News2

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!