Rahul Gandhi: సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. కన్నీరుమున్నీరైన బాల్‌కౌర్‌.. వీడియో..

సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌.. రాహుల్‌ను చూడగానే ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్​గాంధీ నేరుగా సిద్ధూ స్వగ్రామం మూసాకి వెళ్లి పరామర్శించారు.

Rahul Gandhi: సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. కన్నీరుమున్నీరైన బాల్‌కౌర్‌.. వీడియో..
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2022 | 4:59 PM

Sidhu Moose Wala Case: పంజాబ్‌లో ఇటీవల ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Musewala) దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మూసేవాలా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌.. రాహుల్‌ను చూడగానే ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్​గాంధీ నేరుగా సిద్ధూ స్వగ్రామం మూసాకి వెళ్లి పరామర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ పలువురు నేతలు ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మూసేవాలా నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మూసేవాలా హత్య జరిగిన సమయంలో రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉంటే.. సిద్ధూ తల్లిదండ్రులను గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కలిసి మాట్లాడి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

8 మంది అరెస్ట్..

ఇవి కూడా చదవండి

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో 8 మందిని సిట్‌ అరెస్టు చేసింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా షూటర్లకు రాకెటింగ్, లాజిస్టికల్ సపోర్టు అందించారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అరెస్టయిన వారిలో ఒకరు మూసేవాలా గురించిన మొత్తం సమాచారాన్ని ముష్కరులకు అందించాడు. కాగా.. మే29న సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యాడు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో కొందరు అడ్డగించి.. అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గ్యాంగ్‌స్టర్‌ గొడవల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?