Congress Leader Rahul Gandhi: ‘మోదీస్టైల్ ఇదే ! మూసేయండి, అణచివేయండి, తొక్కి పెట్టండి; రాహుల్ గాంధీ ఫైర్
రైతుల నిరసనపై రెచ్ఛగొట్టే వ్యాఖ్యలతో కూడిన 250 ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ట్విటర్ ను ఆదేశిస్తూ హోం శాఖ జారీ చేసిన ఆదేశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
రైతుల నిరసనపై రెచ్ఛగొట్టే వ్యాఖ్యలతో కూడిన 250 ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ట్విటర్ ను ఆదేశిస్తూ హోం శాఖ జారీ చేసిన ఆదేశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ తీరు ఇదేనని, వాటిని మూసేయండి, అణచి వేయండి, తొక్కి పెట్టండి అన్నదేనని ఆయన అన్నారు. ట్విటర్ హెల్ప్స్ గవర్నమెంట్ బ్లాక్ అకౌంట్స్..ట్విటర్ ఆన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ అన్న హెడింగ్ తో వఛ్చిన న్యూస్ రిపోర్టు స్క్రీన్ షాట్ ను ఆయన తన ట్వీట్ కు జత చేశారు.
అన్నదాతల నిరసనలకు సంబంధించి ఓ సీపీఎం నేత, కిసాన్ ఏక్తా మోర్చా, మరికొందరు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వీరి అకౌంట్లను మూసి వేయాలని ట్విటర్ కు ఆదేశాలు అందాయి. అయితే ఇది నిరంకుశ చర్య అని రాహుల్ అభిప్రాయపడ్డారు. వీటిని ఫేక్ అంటారా అని మండిపడ్డారు. కాగా రాజ్ దీప్ సర్దేశాయ్ తో సహా కొందరు సీనియర్ జర్నలిస్టులపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై విపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో శాంతి భద్రతలకు వీరి ట్వీట్లు మరింత హాని చేయవచ్చునని పోలీసులు భావించారని, మరి బీజేపీ నేతల ప్రసంగాల మాటేమిటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు.
Modi style of governance-
Shut them upCut them off Crush them down. pic.twitter.com/Rdi0A8ftgp
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2021