CBSE Board Exam 2021: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయంటే..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ..
CBSE Board Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల టైం టేబుల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
షెడ్యూల్..
మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. మే 4 నుంచి జూన్ 11వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్- cbse.nic.in లో లాగిన్ అవ్వండి..
వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ మాట్లాడుతూ.. బోర్డు పరీక్షల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విద్యార్థుల తరుణం రానే వచ్చిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.
Date-sheet of @cbseindia29 board exams of class Xll. Wish you good luck!#CBSE pic.twitter.com/LSJAwYpc7j
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021
Also Read:
UGC-NET Exams: యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. విద్యాశాఖ మంత్రి ట్విట్.. ఎప్పటినుంచంటే?