Train Runs Back: ఉత్తరాఖండ్‌లో వింత ఘటన.. వెనక్కి పరగులు పెట్టిన రైలు.. కారణమేంటో తెలుసా..

ముందుకు పరగులు పెట్టే వాహనాలను మాత్రమే ఇప్పటి వరకు చూశాం... తాజాగా ఓ రైలు వెనక్కి కూత పెడుతూ పరుగులు పెట్టింది. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా..

Train Runs Back: ఉత్తరాఖండ్‌లో వింత ఘటన.. వెనక్కి పరగులు పెట్టిన రైలు.. కారణమేంటో తెలుసా..
Purnagiri Train Runs Back
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 18, 2021 | 2:44 PM

Purnagiri Train Runs Backwards:  ముందుకు పరగులు పెట్టే వాహనాలను మాత్రమే ఇప్పటి వరకు చూశాం… తాజాగా ఓ రైలు వెనక్కి కూత పెడుతూ పరుగులు పెట్టింది. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా 35 కిలోమీటర్ల దూరం వెనక్కి దూసుకుపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఎందుకు ఇలా వెళ్లిందో ఓ సారి చూద్దాం…

ఓ రైలు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లిల్సి ఉంది.. కానీ కొద్ది దూరం బాగానే ప్రయాణించినా ఒక్కసారిగా ఆ రైలు వెనక్కి పరుగు మొదలు పెట్టింది. అయితే ముందుకు వెళ్లాల్సిన రైలు వెనక్కి వెళ్లడం మొదలు పెట్టింది. దాదాపు 26 కిలోమీటర్లు ఇలా ప్రయాణం చేసింది.

అసలు విషయం ఏమిటంటే.. ఆ ట్రైన్ పేరు పూర్ణగిరి జన శాతాబ్ది ఎక్స్ ప్రెస్. కాగా.. రైలు ముందుకు వెళుతుండగా పట్టాలపై ఓ జంతువు అడ్డుగా వచ్చింది. దానిని ఢీకొట్టి చంపేయడం ఇష్టం లేని డ్రైవర్.. బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. అలా సడెన్ గా బ్రేక్ వేసే కమ్రంలో.. ట్రైన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంకేముంది.. ముందుకు వెళ్లాల్సిన రైలు కాస్త వెనక్కి పరుగులు తీసింది. దానిని కంట్రోల్ చేయడానికి అధికారులు చాలా తిప్పలే పడ్డారు. చివరకు దానిని కంట్రోల్ చేసి.. మళ్లీ గమ్య స్థానానికి చేర్చారు.

ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. అదే సమయంలో ఈ కేసులో నిర్లక్ష్యం ఆరోపణతో ఉత్తర రైల్వే లోకోపైలట్‌తోపాటు గార్డును సస్పెండ్ చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి సిగ్నల్ సమీపంలో ఆవు రైలును ఢీ కొనడంతో రైలు ఆగిపోయిందని.. ఆ తర్వాత రైలు ఇంజిన్ మరియు బ్రేక్ పనిచేయడం మానేసి రైలు వెనకకు పరిగెత్తిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు – రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?

Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..!