Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు – రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?

|

Updated on: Mar 18, 2021 | 2:29 PM

Telangana Budget 2021 session updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో పద్దును ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్య‌యం...

Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు - రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?
Telangana budget

Telangana Budget 2021 session updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో పద్దును ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది. కాగా బడ్జెట్‌ ప్రసంగం అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కాగా బడ్జెట్‌లో కేటాయింపులను ఓ సారి చూద్దాం…

పద్దులపై ప్రసంగం ఇక్కడ చూడండి…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2021 01:28 PM (IST)

    తెలంగాణ రాష్ట్ర వార్షిక పద్దు ఇలా…

    రూ.2,30,825.96 కోట్లతో  తెలంగాణ రాష్ట్ర వార్షిక పద్దు‌ రూపుదిద్దుకుంది. రూ.1,69,383.44 కోట్లు రెవెన్యూ వ్యయంగా లెక్కతేల్చారు. రూ.45,509.6 కోట్లు ఆర్థిక లోటుగా అంచనా వేశారు. 29 వేల రూ.46.77 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించారు. రూ.6,743.50 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేశారు.

    శాఖల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రూ.29,271 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక పద్దులో రూ.800 కోట్లు లెక్కచూపించారు. ఈసారి దళితుల కోసం ‘సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌’ ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించింది.

  • 18 Mar 2021 01:13 PM (IST)

    తెలంగాణలో పాఠశాల విద్య కోసం..

    తెలంగాణలో పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు.. ఉన్నత విద్య కోసం రూ.1873 కోట్లు.. రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం

    telangna students

    telangna students

  • 18 Mar 2021 01:08 PM (IST)

    పర్యాటక రంగానికి ప్రత్యేక పద్దు..

    పర్యాటక రంగానికి ప్రత్యేక పద్దును కేటాయిస్తున్నాం.

  • 18 Mar 2021 12:59 PM (IST)

    హరిత తెలంగాణగా మార్చేందుకు...

    హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

    haritha haram in telangana

  • 18 Mar 2021 12:57 PM (IST)

    నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం కాపాడుతోంది..

    ఎన్నో  నష్టాలు ఆర్టీసీని వెంటాడుతున్నా.. ప్రభుత్వం కాపాడుతూ వస్తోంది. 3 వేల కోట్ల నిధులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది.

  • 18 Mar 2021 12:54 PM (IST)

    తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో..

    తెలంగాణ వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బ‌డ్జెట్ కాపీని మంత్రి చ‌దివి వినిపిస్తున్నారు.

    రాష్ట్ర పద్దు రూ. 2,30,825.96 కోట్లు

    రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు

    ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు

    పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు

    రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు

  • 18 Mar 2021 12:40 PM (IST)

    మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు..

    మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు.. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరాకు రూ.250 కోట్లు. మెట్రో రైలు కోసం రూ. 1000 కోట్లు.. పురపాలక, పట్టణాభివృద్ధి అభివృద్ధి కోసం రూ.15, 030 కోట్లు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు మంత్రి హరాష్ రావు.

    Musi

    Musi

  • 18 Mar 2021 12:30 PM (IST)

    తెలంగాణ పద్దు‌లో ఇత‌ర కేటాయింపులు..

    ఎంబీసీ కార్పొరేష‌న్ కు రూ.1,000 కోట్లు బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖ‌కు రూ.1,606 కోట్లు మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ.3,000 కోట్లు మ‌హిళ‌, శిశు సంక్షేమ శాఖ‌కు రూ.1,702 కోట్లు రైతు బంధుకు రూ.14,800 కోట్లు రైతుల రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ.25 వేల కోట్లు ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌కు రూ.1,730 కోట్లు నీటి పారుద‌ల శాఖ‌కు రూ.16,931 కోట్లు స‌మ‌గ్ర భూస‌ర్వేకు రూ.400 కోట్లు ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.11,728 కోట్లు క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌కు రూ.2,750 కోట్లు ఎస్సీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు ఎస్టీ గృహాల‌కు రాయితీపై విద్యుత్ కు రూ.18 కోట్లు మూడు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్ల కోసం రూ.3,000 కోట్లు బీసీల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మికి అద‌నంగా రూ.500 కోట్లు రైతుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు కొత్త స‌చివాల‌య నిర్మాణానికి రూ.610 కోట్లు దేవాదాయ శాఖ‌కు రూ.720 కోట్లు అట‌వీ శాఖ‌కు రూ.1,276 కోట్లు ఆర్టీసీకి రూ.1,500 కోట్లు మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు ఓఆర్ఆర్ లోప‌ల కొత్త కాల‌నీల్లో తాగునీరు కోసం రూ.250 కోట్లు వరంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు

  • 18 Mar 2021 12:25 PM (IST)

    గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్ల కేటాయింపులు..

    పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్ల కేటాయింపులు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు రూ.5 కోట్ల చొప్పున నియోజ‌క వ‌ర్గాల‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు మొత్తం క‌లిపి రూ.800 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వివ‌రించారు.

  • 18 Mar 2021 12:24 PM (IST)

    వ్య‌వ‌సాయ రంగంలో యాంత్రీక‌ర‌ణ కోసం..

    ముఖ్య‌మంత్రి ద‌ళిత్ సాధికార‌త‌కు రూ.1,000 కోట్లు ఇస్తున్న‌ట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. వ్య‌వ‌సాయ రంగంలో యాంత్రీక‌ర‌ణ కోసం రూ.1,500 కోట్లు కేటాయిస్తున్నామ‌న్నారు. క‌రోనా కార‌ణంగా ఎన్నో ఆర్థిక‌, ఆరోగ్య స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామ‌ని చెప్పారు. జీఎస్‌డీపీ భారీగా త‌గ్గింద‌ని తెలిపారు.

  • 18 Mar 2021 12:21 PM (IST)

    ఈ ఏడాది రూ.47,500 కోట్ల రుణాలు..

    ఈ ఏడాది రూ.47,500 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదన చేశారు మంత్రి హరీష్ ‌రావు.  చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు.. బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు

  • 18 Mar 2021 12:15 PM (IST)

    ప్రకృతి వనం, వైకుంఠధామం వంటి మౌలిక సౌకర్యాలు...

    తెలంగాణ తరహాలో వేరే రాష్ట్రం గ్రామాలకు ఈ విధంగా నిధులను విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ నర్సరీ పల్లె ప్రకృతి వనంలా వైకుంఠధామం వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటా పథంగా చెప్పగలనని హరీశ్‌రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులు రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది.

  • 18 Mar 2021 12:14 PM (IST)

    డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం..

    double bedroom houses

    double bedroom houses

    డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక నిధులను  కేటాయించింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లును ఏర్పాటు చేసింది.

  • 18 Mar 2021 12:11 PM (IST)

    కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు..

    తెలంగాణలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

  • 18 Mar 2021 12:08 PM (IST)

    రైతులకు మరోసారి చేయూత..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు మరోసారి చేయూతనందించింది. ఈసారి బడ్జెట్‌లో రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు.. రైతు బీమా కోసం రూ. 25 వేల కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు.

  • 18 Mar 2021 12:06 PM (IST)

    రీజనల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు..

    రీజనల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.. నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు.. పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు తెలంగాణ పద్దులో కేటాయించారు.

  • 18 Mar 2021 12:06 PM (IST)

    దేవాదాయశాఖకు రూ.720 కోట్లు..

    దేవాదాయశాఖకు రూ.720 కోట్లు.. అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.. ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయింపు

  • 18 Mar 2021 11:53 AM (IST)

    తెలంగాణ బడ్జెట్‌లో అంచనా.. వ్యయం.. మిగులు ఎంతంటే..?

    1. రాష్ట్ర బడ్జెట్‌ - రూ.2,30,825.96 కోట్లు

    2. రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు

    3. ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.60 కోట్లు

    4. పెట్టుబడి వ్యయం - రూ.29,046.77 కోట్లు

    5. రెవెన్యూ మిగులు - రూ.6,743.50 కోట్లు

  • 18 Mar 2021 11:49 AM (IST)

    సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. ప్రగతిలో తెలంగాణ ముందుంది - మంత్రి హరీష్ రావు

    గురుతర బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యలు,సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపథాన పయనిస్తున్నాం స్పష్టంచేశారు హరీష్ రావు.

  • 18 Mar 2021 11:49 AM (IST)

    రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను..

    రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను స‌మ‌యంలోగా పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. స‌మ‌స్య‌ల‌ను, స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా బ‌డ్జెట్ ఉంటుంద‌ని చెప్పారు.

  • 18 Mar 2021 11:48 AM (IST)

    ఆరు వందల అరవై ఎనిమిది ట్రాక్టర్లను అందించాం- మంత్రి హరీష్ రావు

    తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామపంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి ఈ సంవత్సరం రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ట్రాక్టర్లను అందించాం అని మంత్రి హరీష్ ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలాలు లేదు అని అన్నారు. ఇవ్వాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు అని అభిప్రాయపడ్డారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల టెన్షన్ గా నిధులను విడుదల చేస్తున్నది పల్లె ప్రగతి కింద ఇప్పటివరకు 5761 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు విడుదల చేశామని చెప్పారు మంత్రి హరీష్ రావు.

  • 18 Mar 2021 11:46 AM (IST)

    పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం - మంత్రి హరీష్ రావు

    ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని సుందరంగా మార్చేసింది చెత్త సేకరణ మీద అ ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమం నిర్వహించింది ప్రతి గ్రామానికి తరలింపునకు ఒక ట్రాక్టర్ ను డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లె పరిశుభ్రంగా మారిపోయాయి పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టం లో గ్రామ సర్పంచు లకు ప్రత్యేక విధులను బాధ్యతను పేర్కొంది ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్ సమకూర్చింది

  • 18 Mar 2021 11:45 AM (IST)

    పల్లెల్లో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం...- మంత్రి హరీష్ రావు

    పల్లెల్లో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు దారిపొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది.ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని ,పచ్చదనాన్ని పెంచాలని గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణ ప్రకటించారు మంత్రి హరీష్ రావు.

  • 18 Mar 2021 11:44 AM (IST)

    మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ...

    మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయని చెప్పారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, కూలిపోయిన ఇండ్ల శిథిలాలు దారిపొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది.

  • 18 Mar 2021 11:43 AM (IST)

    ప్రతికూల పరిస్థితుల్లో ముందు జాగ్రత్తలు.. -మంత్రి హరీష్ రావు

    కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ముందు జాగ్రత్తలు తీసుకున్న ఘనత తెలంగాణ ముఖ్యమంత్రికి చెందుతుంది. ఆరోగ్య, ఆర్ధిక రంగంలో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంది తెలంగాన అని వెల్లడించారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు

  • 18 Mar 2021 11:27 AM (IST)

    సభాపతి పోచారంతోపాటు మండలి ఛైర్మన్‌కు అందజేసిన మంత్రులు

    సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతిని అందజేశారు. బడ్జెట్‌ ప్రతి మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి అందజేశారు.

  • 18 Mar 2021 11:08 AM (IST)

    ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకనేలా బడ్జెట్‌ రూపకల్పన

    అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్‌రావు సమావేశాలకు వెళ్లే ముందు జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు అన్నారు.

  • 18 Mar 2021 11:02 AM (IST)

    బడ్జెట్‌ ప్రతుల అందజేత

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి బడ్జెట్‌ ప్రతులను అందజేశారు. ఈ బడ్జెట్‌ ప్రతులను మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డిలు అందజేశారు.

  • 18 Mar 2021 11:00 AM (IST)

    కాసేపట్లో వార్షిక బడ్జెట్‌

    కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు హరీష్‌రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసన మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Published On - Mar 18,2021 1:50 PM

Follow us
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..