Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వల్ల ఇంత పెద్ద సమస్యనా..? ఆ యువతికి రూ.28 వేల ఫైన్‌..!

Viral Video: కొందరు ఏ పని చేసినా.. దానిని వెంటనే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొన్ని కొన్ని ప్రమాదకరమైనవి అయినా.. విచిత్రమైనవి అయినా ఏది పడితే అది చేసి వీడియోలు తీయడం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం..

Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వల్ల ఇంత పెద్ద సమస్యనా..? ఆ యువతికి రూ.28 వేల ఫైన్‌..!
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Mar 18, 2021 | 1:02 PM

Viral Video: కొందరు ఏ పని చేసినా.. దానిని వెంటనే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొన్ని కొన్ని ప్రమాదకరమైనవి అయినా.. విచిత్రమైనవి అయినా ఏది పడితే అది చేసి వీడియోలు తీయడం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం… అందరికి ఇదో సరదాగా అయిపోయింది. కానీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో పెద్దగా ఆలోచించరు. పోస్టు చేయడమే వారి వంతు. తర్వాత ఇబ్బందులు పడిపోతుంటారు. కొందరు కొందరు యువతులు సరదాగా చేసిన వీడియో వారికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఓ యువతి చేసిన వీడియో వల్ల భారీగా ఫైన్‌ పడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి ఆ యువతి చేసిన బైక్‌ స్టంట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి చివరకు ట్రాఫిక్‌ పోలీసుల కంటపడింది. ఇంకేముంది ఆ యువతికి పోలీసులు రూ. 28వేల ఫైన్‌ విధించారు. నిబంధనలు ఉల్లంఘించి వీడియో చేసినందుకు గాను ఫైన్‌ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివంగి దబాస్‌, రెజ్లర్‌ స్నేహ రఘువంశి ఇద్దరు స్నేహితులు ఘజియాబాద్‌ రోడ్డుపైన స్నేహ రఘువంషి తన స్నేహితురాలైన శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చోబెట్టుకుని బైక్‌ను నడిపింది. ఈ బైక్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. చివరకు ఆ వీడియో పోలీసుల కంట పడటంతో రఘువంషి తల్లి మంజూదేవికి రూ.11వేల చలానా పంపారు. అదే విధంగా బైక్‌ యజమాని అయిన సంజయ్‌ కుమార్‌కు రూ.17వేల జరిమానా విధించారు. ఈ ఇద్దరు యువతులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదని పోలీసులు వెల్లడించారు.

కాగా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగిస్తూ అనుమతి లేకుండా రోడ్డలపై స్టంట్‌ చేసినందుకు గానూ చలానా పంపి, జరిమానా వేసినట్లు ఘజియాబాద్‌ ట్రాఫిక్‌ ఎస్పీ రామానంద్‌ కుష్వాహా తెలిపారు. వాళ్లు నడిపిన బైక్‌కు నంబర్‌ ప్లేటు కూడా లేదని ఆయన తెలిపారు. దీంతో రఘువంషి మాట్లాడుతూ.. తాము స్టంట్‌ ప్రాక్టిస్‌ చేయడం కోసం జనాలు ఎక్కువ లేని మార్గాన్ని ఎంచుకున్నామని, కేవలం సరదాగా ఆ వీడియో తీశామని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇంత సమస్య తెచ్చి పెడుతుందని ఊహించలేదని పేర్కొన్నారు.

సో.. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సరదా కోసమని బైక్‌లపై స్టంట్‌ చేసినట్లయితే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఇలాంటి ఘటనల వల్ల పరువు పోతుంది.. అటు డబ్బులు పోతాయి. అవసరం అనుకుంటే కేసులు కూడా నమోదు అవుతాయి. మిత్రులారా .. తస్మాత్‌ జాగ్రత్త.