AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Cabinet: తొలి కేబినెట్‌లోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం.. పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం చండీగఢ్‌లో జరిగింది. మాన్ మంత్రివర్గం 25 వేల పోస్టుల తక్షణ నియామకానికి ఆమోదం తెలిపింది.

Punjab Cabinet: తొలి కేబినెట్‌లోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం.. పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం
Punjab Cabinet
Balaraju Goud
|

Updated on: Mar 19, 2022 | 8:46 PM

Share

Punjab Cabinet Meeting: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal)ను ఆదర్శంగా తీసుకుని పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్(Bhagwat Mann) దూసుకుపోతున్నారు. తొలి కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 25,000 ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs)ను విడుదల చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం చండీగఢ్‌లో జరిగింది. మాన్ మంత్రివర్గం 25 వేల పోస్టుల తక్షణ నియామకానికి ఆమోదం తెలిపింది. పంజాబ్‌లోని బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే, మూడు నెలల ఓట్ ఆన్ అకౌంట్ (మూడు నెలల ప్రభుత్వ వ్యయ బడ్జెట్) ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూన్‌ నెలలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సప్లిమెంటరీ గ్రాంట్‌లకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలీసు శాఖలో పది వేల ఉద్యోగాలు రానున్నాయి. అదే సమయంలో, ఇతర వివిధ విభాగాలలో 15 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఒకే నెలలో నోటిఫికేషన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. పంజాబ్ యువతకు ఉపాధి కల్పిస్తామని భగవంత్ మాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి మంత్రివర్గంలోనే భగవంత్ మాన్ యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.

అంతకుముందు, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఒక మహిళ సహా పది మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. పంజాబ్‌ భవన్‌లో గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 10 మంది మంత్రుల్లో ఎనిమిది మంది తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరంతా పంజాబీ భాషలో ప్రమాణం చేశారు. హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్ మీట్ హెయిర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రహ్మ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బెయిన్స్ మరియు డాక్టర్ బల్జీత్ కౌర్‌లకు ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 18 పదవులు ఉన్నాయి.

ఇదిలావుంటే, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో బుధవారం నాడు పంజాబ్ గవర్నర్ భగవంత్ మాన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 92 సీట్లను గెలుచుకుంది, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) కూటమి మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఎస్‌ఎడిలను ఓడించింది. తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికార పగ్గాలు చేపట్టింది.

Read Also…. Russia-Ukraine War: నేనూ యుద్ధంలో పాల్గొంటా.. అధికారులను కోరిన 98ఏళ్ల బామ్మ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు