మద్యం ప్రియులకు కిక్ ఎక్కించే వార్త.. భారీగా తగ్గిన ధరలు.. వాటిపై నిషేధం ఎత్తివేత
మందు బాబులకు పంజాబ్(Punjab) ప్రభుత్వం కిక్ ఎక్కించే వార్త చెప్పింది. ఈ మేరకు ఆప్ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ మంత్రివర్గం...
మందు బాబులకు పంజాబ్(Punjab) ప్రభుత్వం కిక్ ఎక్కించే వార్త చెప్పింది. ఈ మేరకు ఆప్ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. వివిధ బ్రాండ్ల మద్యంపై 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తోంది. అంతే కాకుండా లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించకుండా టెండర్లు ఆహ్వానించడం ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనున్నటలు వెల్లడించింది. నుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
మద్యం కల్తీ, స్మగ్లింగ్, ను అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. దీంతోహర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండనున్నాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్‌ఎల్ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఈ మద్యం ధర 400 రూపాయలకే వినియోగదారులకు అందనుంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి