ఆ ఇద్దరు డ్రైవర్లను టార్చర్ పెట్టిన పాకిస్తాన్

ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు డ్రైవర్లను పాకిస్తాన్ కు చెందిన కొంతమంది సోమవారం బలవంతంగా ఓ అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి.. అక్కడ వారిని చిత్ర హింసలు పెట్టారని తెలిసింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో..

ఆ ఇద్దరు డ్రైవర్లను టార్చర్ పెట్టిన పాకిస్తాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 5:54 PM

ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు డ్రైవర్లను పాకిస్తాన్ కు చెందిన కొంతమంది సోమవారం బలవంతంగా ఓ అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి.. అక్కడ వారిని చిత్ర హింసలు పెట్టారని తెలిసింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ కార్యాలయానికి ఐదారు కార్లలో వఛ్చిన కొంతమంది.. ఆ ఇద్దరి కళ్ళకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారని, యాక్సిడెంట్ చేశామని ఒప్పుకోవలసిందిగా కోరుతూ.. ఇనుపరాడ్లతో, కర్రలతో కొట్టారని తెలిసింది. పైగా బలవంతంగా కలుషిత నీటిని కూడా తాగించారట.. మీ కార్యాలయంలో పని చేసే ప్రతివారి విధులు తెలియజేయాలని, వారికి  కూడా మీకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారని తెలియవచ్చింది. సుమారు 12 గంటల సేపు ఇలా టార్చర్ పెట్టిన తరువాత.. తిరిగి వారిని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద వదిలి వెళ్లారట.. ఒళ్ళంతా తీవ్ర గాయాలకు గురైన ఆ ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు.