విద్యార్థులకు ఆపిల్ సంస్థ అఫర్
ఆపిల్ విద్యార్థులకు ఓ అఫర్ తీసుకువచ్చింది. బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్‌లో భాగంగా విద్యార్థుల కోసం హెడ్ ఫోన్లను ఆపిల్ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఐప్యాడ్ ఎయిర్ కొనుగోలు చేస్తే.. సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితం.
ఆపిల్ విద్యార్థులకు ఓ అఫర్ తీసుకువచ్చింది. బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్‌లో భాగంగా విద్యార్థుల కోసం హెడ్ ఫోన్లను ఆపిల్ కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్‌లో విద్యార్థులు, అధ్యాపకులు 899 డాలలర్ల ధరతో మాక్‌బుక్ ఎయిర్ గానీ, 479 డాలర్ల విలువ చేసే ఐప్యాడ్ ఎయిర్ గానీ కొనుగోలు చేస్తే.. సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా ఇవ్వనుంది. అదనంగా 40 డాలర్లతో వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుతో ఎయిర్‌పాడ్స్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశాన్ని ఆపిల్ అందిస్తోంది. కేవలం 90 డాలర్లతో ఎయిర్‌పాడ్స్ ప్రో కొనుగోలు చేసుకోవచ్చు. ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్ ఈ ఒప్పందానికి ఎంట్రీ పాయింట్ కాగా, 2020 ఐప్యాడ్ ప్రో పలు సైజుల్లో మాక్‌బుక్ ప్రోలతో ఉచిత హెడ్‌ఫోన్‌లను పొందవచ్చు. ఆపిల్ బ్యాక్-టు-స్కూల్ ప్రమోషన్‌లో చేర్చిన ఉత్తమ ఫ్రీబీ ఇది.