ఒడిషాలో పెరుగుతున్నకరోనా కేసులు.. తాజాగా మరో 108..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ నిత్యం వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ నిత్యం వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం నమోదైన కేసులతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,163కి చేరింది.
ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,091కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,53,178, యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 1,80,013 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 9900 మంది వరకు మరణించారు.