తిరుమలలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి కామెంట్స్
దేవదేవుడు తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి ఈ ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన దేశ రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నిరంకుశ పాలన కనిపిస్తుందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భాగస్వామ్య పక్షాలకు, ప్రతిపక్షాలకు విలువ ఇవ్వట్లేదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతు వ్యతిరేకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూశామని చెప్పిన నారాయణస్వామి.. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని […]

దేవదేవుడు తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి ఈ ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన దేశ రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నిరంకుశ పాలన కనిపిస్తుందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భాగస్వామ్య పక్షాలకు, ప్రతిపక్షాలకు విలువ ఇవ్వట్లేదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతు వ్యతిరేకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూశామని చెప్పిన నారాయణస్వామి.. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు.
వ్యవసాయంలోకి కార్పొరేట్ సంస్థలను తీసుకురావాలనే ఆలోచన చిన్న సన్నకారు రైతులను బానిసలు చేయటమేనని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లు రాకుండా పార్లమెంట్లో అడ్డుకునే ప్రయత్నం చేశాయని.. భాగస్వామ్య పక్షం అకాలీదళ్ బయటికి వచ్చి నిరసన తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొండి వైఖరితో తీసుకొచ్చిన ఈ బిల్లులు నరేంద్ర మోదీ వైఫల్యాలుగా మిగిలిపోతాయని సీఎం నారాయణస్వామి అన్నారు.



