ఉ. 9.30 నుంచి సివిల్స్ ప్రిలిమినరీ.. హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్దమైంది. ఈ ఉదయం గం. 9.30 నుండి 11.30 వరకు మొదటి సెషన్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం గం. 2.30 నుండి 4.30 వరకూ రెండో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్స్ లో జరిగే ఈ పరీక్షను హైదరాబాద్ లో 46 వేల 171 మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఇందుకోసం సిటీలో 99 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. […]

ఉ. 9.30 నుంచి సివిల్స్ ప్రిలిమినరీ.. హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు
Venkata Narayana

|

Oct 04, 2020 | 6:52 AM

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్దమైంది. ఈ ఉదయం గం. 9.30 నుండి 11.30 వరకు మొదటి సెషన్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం గం. 2.30 నుండి 4.30 వరకూ రెండో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్స్ లో జరిగే ఈ పరీక్షను హైదరాబాద్ లో 46 వేల 171 మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఇందుకోసం సిటీలో 99 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి. అడ్మిట్ కార్డ్ తో పాటు గుర్తింపు కూడా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

అటు, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సివిల్స్ ప్రిలిమినరీ రాసే అభ్యర్థులకోసం రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు స‌ర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభమయ్యాయి. సివిల్స్ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థుల‌కు డీఎంఆర్‌సీతో పాటు సౌత్ వెస్ట్రన్ రైల్వే త‌న సేవ‌ల‌ను అందిస్తోంది. వాయువ్య కర్ణాటకలోని హుబ్లీ నుండి బెంగళూరు వరకు ప్రత్యేక రైలును నడుపుతోంది. అదేవిధంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సైతం రెండు ప్రత్యేక రైళ్లను న‌డుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని క‌డ‌ప నుండి అనంత‌పురం, క‌ర్నూలు నుంచి అనంత‌పురం వ‌ర‌కు రైళ్లను న‌డుపుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu