Bigg Boss 4: స్వాతి దీక్షిత్‌ ఔట్‌.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్..!

గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌కి ఊహించని షాక్ తగిలింది. నాలుగోవారం జరిగిన ఎలిమినేషన్‌లో స్వాతి బయటకు రానుంది.

Bigg Boss 4: స్వాతి దీక్షిత్‌ ఔట్‌.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 04, 2020 | 7:14 AM

Bigg Boss 4 Swathi Deekshith: గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌కి ఊహించని షాక్ తగిలింది. నాలుగోవారం జరిగిన ఎలిమినేషన్‌లో స్వాతి బయటకు రానుంది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో స్వాతి ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో స్వాతి, బిగ్‌బాస్‌కి చుట్టపుచూపుగా వచ్చి బయటకు పోతుంది. రాజశేఖర్ మాస్టర్ స్వాతి పేరును నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా స్వాతి హౌజ్‌లోకి వెళ్లిన తరువాత మోనాల్‌కి గట్టి పోటీ ఇచ్చింది. వచ్చిన రోజే తనను ఇంప్రెస్ చేసిన నలుగురికి సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చింది. ఇక మోనాల్‌, హారికలను కవర్ చేస్తూనే స్వాతితో అభి బాగా పులిహోర కలిపేవాడు. అయితే బిగ్‌బాస్‌ టాస్క్‌ల్లో అంత యాక్టివ్‌గా లేకపోవడంతోనే స్వాతి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వారం నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రతివారం నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిగా సేవ్‌ చేస్తూ వచ్చిన నాగ్ ఈసారి ఎవరినీ సేవ్ చేయలేదు. ఇది కేవలం ఎలిమినేషన్ మాత్రమే అని ఎవర్నీ సేవ్ చేయాలేదని ఈ సందర్భంగా నాగ్‌ చెప్పారు. దీంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్‌లలో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు సమాచారం.

Read More:

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ఇవే కీలక అంశాలు…

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం ఇదేనా..!