బిగ్ బాస్ 4: హౌస్‌లో అర్ధరాత్రి ఘాటు రొమాన్స్‌లు.!

బిగ్ బాస్ 4లో లవ్ ట్రాక్స్, హగ్గులు, ముద్దులకు కొదవే లేదు. మరీ ముఖ్యంగా అభిజిత్-మోనాల్-అఖిల్ మధ్య లవ్ ట్రైయాంగిల్ నడిపించి అత్యధిక టీఆర్ఫీలు దండుకోవాలని బిగ్ బాస్ గట్టి ప్లాన్ వేసినట్లు..

బిగ్ బాస్ 4: హౌస్‌లో అర్ధరాత్రి ఘాటు రొమాన్స్‌లు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 03, 2020 | 4:47 PM

Bigg Boss 4: బిగ్ బాస్ 4లో లవ్ ట్రాక్స్, హగ్గులు, ముద్దులకు కొదవే లేదు. లవ్ స్టోరీలు అయితే మొదటి మూడు వారాల్లోనే చాలా నడిచాయి. అఖిల్- మోనాల్-అభిజిత్, అభిజిత్-హారిక, అభిజిత్-సుజాత, అభిజిత్-స్వాతి ఇలా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా అభిజిత్-మోనాల్-అఖిల్ మధ్య లవ్ ట్రైయాంగిల్ నడిపించి అత్యధిక టీఆర్ఫీలు దండుకోవాలని బిగ్ బాస్ గట్టి ప్లాన్ వేసినట్లు గురువారం ఎపిసోడ్‌తో క్లియర్ అయిపోయింది.

కిందటి వారమే నాగార్జున.. మోనాల్ మనసులో ఒక ‘A’ ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. దానికి ఆమె కూడా సిగ్గుపడుతూ ‘అవును’ అని అంగీకరించింది. అయితే ఆమె మనసులో ఉన్న ఆ ‘A’ అఖిలా.? లేక అభినా.? అనేది క్లారిటీ రాలేదు. కానీ మోనాల్ మాత్రం ఇద్దరి కృష్ణుల ముద్దుల రాధాగా మారిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే గురువారం ఎపిసోడ్‌లో హారిక, దివిలతో మాట్లాడుతూ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గురించి అభి చర్చించాడు. యాక్చువల్‌గా ‘A’ అంటే నేనొక్కడినే.. కానీ ఇక్కడ మరో ‘A’ వచ్చింది. అది నాకు నెగటివ్. ఇదో దరిద్రమైన యాంగిల్. అసలు వాళ్లు మొదట అనుకున్నది మా ఇద్దరినే. నాకు తెలుసు. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. మోనాల్ ‘ఐ లైక్ యూ’ అని కూడా చెప్పింది. ఐ థింక్ ఇట్స్ ఏ మూమెంట్ అనుకున్నా అని దివి, హారికలకు అభి మొత్తం వివరించాడు. ఇలా ఒకవైపు హారిక, దివిలతో అభి చర్చిస్తుంటే.. బయట సోఫాలో అఖిల్-మోనాల్‌లు అర్ధరాత్రి రొమాన్స్‌కు తెరలేపారు. దుప్పటి ముసుగు తన్ని పడుకున్న అఖిల్ తలను మోనాల్ నిమరడం.. అలాగే అఖిల్ కూడా మోనాల్‌ను జోకొట్టడం జరిగింది.

ఇదంతా ఒక ఎత్తయితే.. మరో పక్క జైలు దగ్గర హారికను వెనుక నుంచి వచ్చి అభిజిత్ గట్టిగా వాటేసుకోవడం.. దానికి ఆమె తెగ సంబరపడిపోయి గుడ్ నైట్ మచ్చా అని అనడం జరిగింది. ఇదంతా చూసిన ప్రేక్షుకులు ఈ మిడ్ నైట్ రొమాన్స్‌లు ఏంటిరా బాబు అని అనుకుంటున్నారు. అసలు వీళ్లే ఈ గేమ్ ఆడుతున్నారా.. లేక బిగ్ బాస్ ఆడిస్తున్నాడా అన్నది తెలియట్లేదు.

ఏది ఏమైనా హౌస్‌లో ఎక్కడ చూసిన అభి మాత్రం.. అమ్మాయిలతోనే కనిపిస్తూ ఉన్నాడు. అటు హౌస్ మేట్స్ ఎవరైనా అభిని ఒక మాట అంటే చాలు.. హారిక శివంగిలా వారి మీదకు దూసుకొస్తోంది. ఇక మోనాల్ ఐ లైక్ యూ చెప్పిన దగ్గర నుంచి అభి ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఇంగ్లీష్ పాపలు హారిక. మోనాల్ ధాటికి ఇది తెలుగు బిగ్ బాస్ షోనా.. లేక ఇంగ్లీష్ షోనా అన్నది అర్ధం కావట్లేదు. బిగ్ బాస్ పలుసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా హౌస్‌లో ఇంగ్లీష్ మాటలు ఆగట్లేదు. మరి బిగ్ బాస్ వీరిని కట్టడి చేస్తాడా.? లేక రెచ్చగొడతాడా.? అనేది చూడాలి.!