Khalistan Terrorist: పంజాబ్, మహారాష్ట్ర పోలీసుల సంయుక్త ఆపరేషన్.. నాందేడ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది అరెస్ట్..
Khalistan Terrorist: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది సరబ్‌జిత్ సింగ్ కిరాట్‌ను పంజాబ్ సీఐడీ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని లూధియానా..
Khalistan Terrorist: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది సరబ్‌జిత్ సింగ్ కిరాట్‌ను పంజాబ్ సీఐడీ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని లూధియానా జిల్లాకు చెందిన సరబ్‌జిత్ సింగ్ కిరాట్‌ను పంజాబ్ సీఐడీ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు ఆదివారమే అదులోకి తీసుకున్నారు. అయితే ఖలిస్థాన్ కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు వీలుగా.. అతన్ని పూర్తిగా ప్రశ్నించిన అనంతరం మంగళవారం పోలీసులు వెల్లడించారు. దేశానికి వ్యతిరేకంగా సరబ్‌జిత్ సింగ్ ఖలిస్థాన్ కార్యకలాపాలను కొసాగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
దీంతోపాటు పంజాబ్, యూపీ పోలీసులు లక్నోలో ఉన్న మరో ఖలిస్థాన్ ఉగ్రవాదిని కూడా అరెస్టు చేశారు. పంజాబ్, యూపీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పంజాబ్ ఫిరోజ్‌పూర్‌కు చెందిన జగదేవ్ సింగ్.. జగ్గా అనే ఖలిస్థాన్ ఉగ్రవాదిని సోమవారం అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే అతనికి ఖలిస్థాన్ ఉగ్రవాదులు పరంజిత్ సింగ్ పమ్మా, మల్తానీ సింగ్‌లతో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది.
Also Read: