Swarnim Vijay Mashaal : పాకిస్తాన్‌పై విజయం సాధించి 50 ఏళ్లు.. స్వర్నిమ విజయ్ వర్ష కార్యక్రమానికిి చీఫ్ గెస్ట్‌గా సీఎం కేసీఆర్
ఇండోపాక్ యుద్దంలో గెలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశమంతా స్వర్నిమ విజయ్ వర్ష వేడుకలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కూడా ఈనెల 11వ తేదీన ఘనంగా కార్యక్రమం జరుగబోతోంది
Swarnim Vijay Mashaal : పాకిస్తాన్‌పై 1961 యుద్దంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత సైన్యం ఘనంగా వేడుకలు జరుపుకుంటోంది. స్వర్నిమ విజయ్ వర్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి అంకురార్పణ గోల్కొండ లోని ఆర్టిలరీ సెంటర్‌లో జరిగింది.
ఈనెల 11వ తేదీన సికింద్రాబాద్ వీరుల సైనిక స్మారక కేంద్రంలో ఘనంగా స్వర్నిమ విజయ్ వర్ష కార్యక్రమం జరుగుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సైనిక అమరవీరులను స్మరిస్తూ ఢిల్లీలో వెలిగించిన కాగడాను దేశమంతా తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు కూడా ఈ కాగడాను తీసుకొచ్చారు. ఈనెల సికింద్రాబాద్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై , ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు కూడా హాజరవుతారు. తెలంగాణ నుంచి ఎందరో భారత సైన్యంలో సేవలందిస్తున్నారని ఇది రాష్ట్రానికి గర్వకారణమని ఆర్మీ అధికారులు అన్నారు. గాల్వాన్‌లోయలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కూడా సన్మానించబోతున్నారు. ఇద్దరు వీర్‌చక్ర గ్రహీతలతో పాటు శౌర్య చక్ర పొందిన జవాన్లను ఈనెల 11వ తేదీన జరిగే కార్యక్రమంలో సన్మానిస్తారు. స్వర్నిమ విజయ్ వర్ష్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలో ప్రారంభించారు.
నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర కాగడాను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కాగడా ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఏడాది పాటు ఈ విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో ఈ గెలుపు దివిటీకి ఘనస్వాగతం లభించింది.
జంటనగరాల ప్రజలు స్వర్నిమ విజయ్ వర్ష్ కార్యక్రమలో అమర జవాన్లకు ఘననివాళి అర్పించబోతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 11వ తేదీన కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగబోతోంది. ప్రజలందరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. దేశం కోసం పోరాడిన మాజీ ఆర్మీ అధికారులను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించబోతున్నారు.