ఈ నెల 15 తో ముగియనున్న గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం, గద్గదికమైన ప్రధాని మోదీ స్వరం

కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్ తో తన సాన్నిహిత్యంపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో ఆయనకు,

ఈ నెల 15 తో  ముగియనున్న గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం,  గద్గదికమైన ప్రధాని మోదీ స్వరం

కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్ తో తన సాన్నిహిత్యంపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో ఆయనకు, తనకు ఉన్న మైత్రీ బంధాన్ని గుర్తుకు తెచ్చుకుని కంట తడి పెట్టారు. తాను, ఆజాద్ దాదాపు ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నామని,  ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ కు ఆయన సీఎం అయితే తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన అన్నారు. తమ ఇద్దరి సాన్నిహిత్యం  మాటలతో చెప్పనలవి కాదన్నారు. 2007 లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగినప్పుడు ఆ సంఘటన గురించి తనకు మొదట ఆజాదే చెప్పారని, నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పలువురు పిల్లల తలిదండ్రులు, వారి రోదనలతో ఆయన చలించిపోయారని మోదీ అన్నారు. ఆజాద్ వంటి  రాజకీయ నేత ఈ రోజుల్లో ఉండడం అరుదన్నారు.

రాజ్యసభ సభ్యునిగా గులాం నబీ ఆజాద్ సభ్యత్వం ఈ నెల 15 తో ముగియనుంది. అయితే ఆయనను తాను  రిటైర్ కానివ్వనని, ఆయన సలహాలు తీసుకుంటూనే ఉంటానని మోదీ చెప్పారు. ఆజాద్ ను నిజమైన స్నేహితునిగా ఆయన అభివర్ణించారు. ఇందుకు ఆజాద్ కూడా స్పందిస్తూ తనకు, మోదీకి మధ్య వేర్వేరు భావాలు ఉన్నా..తమ పార్టీలు వేరైనా, సభలో తమ వాదనలు వేరైనా వ్యక్తిగతంగా తాము గాఢ స్నేహితులమని ఆయన పేర్కొన్నారు.

Read More:సరిహద్దుల్లో ఎవరైనా మనల్ని ఎదుర్కొంటే అందుకు దీటైన సమాధానమిస్తాం, ప్రధాని మోదీ హెచ్ఛరిక.

Read More:మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న మినిస్టర్.. పలువురి సంతాపం

Click on your DTH Provider to Add TV9 Telugu