ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు

ఉత్తరాఖండ్ లో నెలకొన్న విషాదం ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. పవర్ ప్రాజెక్ట్ ధ్వసం కావడంతో ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికుల సహా పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ అప్పటి నుంచి తన సేవలను అందిస్తూనే ఉంది...

ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2021 | 4:34 PM

reUttarakhand Glacier Burst: ఉత్తరాఖండ్ లో నెలకొన్న విషాదం ఘటనపై సినీ ప్రముఖులు స్పందించారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఒక్కసారిగా మంచు చరియలు విరిగి పడడం.. గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తడంతో తీవ్ర విషాదం నెలకొంది. వరదతో ఆ నదిపై నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ ధ్వసం కావడంతో ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికుల సహా పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ అప్పటి నుంచి తన సేవలను అందిస్తూనే ఉంది. ఈ ఘటనపై పలువురు సినీ నటులు రియాక్ట్ అవుతూ..ప్రమాదంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు. అక్కడ తమ ప్రయాణాలను సైతం లెక్కచేయకుండా సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు తాము అంతా అండగా ఉంటామని సోషల మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, సోను సూద్ రెస్క్యూ టీమ్ సేవలను ప్రశంసించారు. వారికీ తాము అంతా అండగా ఉన్నామని తెలిపారు. ఇక రవితేజ, మహేష్ బాబు, అజయ్ దేవ్‌గన్ కూడా బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు

సంఘటన ప్రాంతానికి సహాయక చర్యల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా తమ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ సంఘటన గురించి రెస్క్యూ టీమ్ సేవలను ప్రశంసిస్తూ.. భారతీయ సినీ తారలు సోషల్ మీడియాలో వారి ప్రయత్నాలను ట్వీట్ చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సంఘటన స్థలంలో సేవలను అందించిన ప్రతి ఒక్కరిని ప్రశంసించారు. మీ పనిని మెచ్చుకోవటానికి పదాలు సరిపోవు.. నేను ఈ విషాదానికి గురైన ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూనే ఉన్నానని ప్రియాంక తెలిపారు. అంతేకాదు మరొక ట్విట్ ద్వారా ఎవరైనా స్థానికంగా ఇబ్బందులు పడుతున్నవారు 1070 లేదా 9557444486 నంబర్లను ఉపయోగించాలని విపత్తు ఆపరేషన్ సెంటర్ యొక్క కాంటాక్ట్ నంబర్ ను ఇచ్చారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా ఘటన స్థలంలో ఉన్న అందరూ క్షేమంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ప్రార్ధన చేయాలనీ కోరారు.

అలియా భట్ ఈ సంఘటనను “విషాదకరమైనదని.. హిమానీనద పేలుడుతో బాధపడుతున్న బాధితులు క్షేమంగా ఉండలని ప్రార్ధించింది. అంతేకాదు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లను కూడా షేర్ చేసింది.

వాతావరణం ఇంతటి భీభత్సాన్ని సృష్టిస్తుందని తాను ఊహించలేదని.. బాధితుల క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్ధించాలని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కోరారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కూడా ఈ విషాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతి ఒక్కరూ బాధితులు క్షేమంగా ఉండలని ప్రార్ధించాలని సూచించారు.

శ్రద్ధా కపూర్ , రితీష్ దేశ్ముఖ్ వారి ధైర్యానికి సిబ్బందికి నమస్కరించారు, అంతేకాదు సిబ్బందిలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండానలని దేవుడిని ప్రార్థించారు.

Also Read:

 శశికళకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన తమిళనాడు సర్కార్.. ఈసారి ఏకంగా..

ఈ నెల 15 తో ముగియనున్న గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం, గద్గదికమైన ప్రధాని మోదీ స్వరం