Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీలో సాధారణ సేవలు పునఃప్రారంభంపై ఉత్తర్వులు… ఈనెల 21 నుంచి అందుబాటులోకి అన్ని రకాల సేవలు..

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభించాలని వైద్య విద్యా కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

గాంధీలో సాధారణ సేవలు పునఃప్రారంభంపై ఉత్తర్వులు... ఈనెల 21 నుంచి అందుబాటులోకి అన్ని రకాల సేవలు..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 13, 2020 | 1:25 PM

#Gandhi Hospital general services: హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభించాలని వైద్య విద్యా కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్, నాన్ కోవిడ్ గా విభజించి సేవలందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ సేవలు, టీచింగ్, అకాడమిక్ పనులు కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్, నాన్ కోవిడ్ సేవల్లో స్టాఫ్ విధులను నిర్ణయించే అధికారం సూపరింటెండెంట్ కు ఉంటుందని డీఎంఈ తెలిపారు.

గతంలో గాంధీలో అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య సేవలను యథావిధిగా కొససాగుతాయని ఆయన ఉత్తర్వుల్లో తెలిపారు. కాగా, రాష్ట్రంలో కరోనా విజృంభణతో గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ సేవలు తప్ప నాన్ కొవిడ్ సేవలను నిలిపివేశారు. అయితే, ఇప్పుడు కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో డీఎంఈ ఈ ఆదేశాలు జారీ చేశారు. గాంధీ ఆస్పత్రిలో మార్చి2న మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు.

దీంతో సాధారాణ సేవలు గాంధీ ఆస్పత్రిలో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. అయితే, గత 15 రోజులుగా జూనియర్ డాక్టర్లందరూ మరోసారి ఆందోళన బాట పట్టారు. సమ్మెకు కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రితో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించడానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు.

మరోవైపు, ఈ నెల 21వ తేదీలోపు గాంధీలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించాలి, అలాగే అక్కడ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు, వైద్య విద్యకు సంబంధించిన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించి కొవిడ్ సేవలు కూడా సమాంతరంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య పేర్కొంది. ఇందుకు అవసరమైతే వేర్వేరు దారుల గుండా రోగులను అనుమతించాలని సూచించారు. అలాగే, వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా చూడటానికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.