AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ

Coronavirus: కరోనా మహమ్మారిని గుర్తించేందుకు సైనిక కుక్కలకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. దేశంలో కాకర్‌ స్పేనియల్‌ జాతికి చెందిన కుక్కలకు కోవిడ్‌-19 గుర్తించే విధంగా...

Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ
Subhash Goud
|

Updated on: Feb 09, 2021 | 5:20 PM

Share

Coronavirus: కరోనా మహమ్మారిని గుర్తించేందుకు సైనిక కుక్కలకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. దేశంలో కాకర్‌ స్పేనియల్‌ జాతికి చెందిన కుక్కలకు కోవిడ్‌-19 గుర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తుల మూత్రం, చెమట నమూనాల ఆధారంగా కరోనా వైరస్‌నుగుర్తించడానికి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఓ శిబిరంలో 806 నమూనాలను సేకరించగా, అందులో 18 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు కుక్కులు గుర్తించాయి.

కరోనా వైరస్‌ బారిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందా..? అంటే అవుననే అంటున్నారు పారిస్‌కు చెందిన పరిశోధకులు. తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇప్పుడు దీని ఆధారంగా భారత సైన్యం కుక్కల ద్వారా కరోనా రోగులను గుర్తించే పనిలో పడ్డారట. మనిషి చెమట వాసనతో కరోనా వైరస్‌ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని పరిశోధకులు తేల్చారు. వాటి ద్వారా కరోనా రోగులను గుర్తించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ సైనిక కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. మనిషి చెమట వాసనతో కరోనా వైరస్‌ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని పరిశోధకులు తేల్చారు. వాటి ద్వారా రోగులను గుర్తించడం ప్రారంభించారు.

కుక్కలకు ట్రైనింగ్‌ ఎలా ఇస్తారు..?

కాగా, పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్లే ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో గుర్తించే శునకాలు వచ్చేశాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో రోగు లక్షణాలు కనిపించక ముందే వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్‌ ఇచ్చారు. మనుషుల్లో మలేరియా, క్యాన్సర్‌ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చి నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.

చెమట వాసన చూసి కరోనాను పసిగట్టేశాయి

ఇందులో భాగంగా గత కొన్ని రోజుల కిందట బెల్జియమ్‌ మలినోస్‌, షెపర్ట్‌ జాతికి చెందిన శునకాలకు అల్పోర్ట్‌లోని నేషనల్‌ వెటర్నరీ స్కూల్‌లో ప్రత్యేక ట్రైనింగ్‌ ఇచ్చారు. చెమట వాసన చూసి కరోనా ఉందో లేదో పసిగట్టేలా శిక్షణ ఇచ్చారు. వారి ప్రయత్నం వృథా కాలేదు. శునకాలు విజయవంతంగా పని చేస్తున్నాయి. మొదటి దశలో కరోనా రోగులు, సాధారణ వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ జాడను పసిగట్టే సామర్థ్యం కుక్కలకు ఉందో లేదో పరీక్షించారు. ఈ పరీక్షల్లో నాలుగు కుక్కులు విజయవంతంగా పపిగట్టాయి. వంద శాతం ఫలితాలు చూపాయి. 8 కుక్కల్లో నాలుగు కుక్కలు వందశాతం కరోనా పాజిటివ్‌ శాంపిల్‌ ఏదో ఇట్టే పసిగట్టగలిగాయి.

తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు

కాగా, ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్‌ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ట్యూమర్స్‌, క్యాన్సర్‌ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్‌ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా శునకాలను వాడుతున్నారు. ఇప్పుడు వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరోనా రోగుల నిర్ధారణకు కూడా వినియోగిస్తున్నారు.

Aslo Read: Coronavirus India: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, మరణాలు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?