AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న మినిస్టర్.. పలువురి సంతాపం

ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట్లో పెను విషాదం నెలకొంది. పలువురు ఆయనకు సానుభూతి, సంతాపం తెలిపారు. కన్నీటి పర్యంతమవుతున్న మంత్రిని ఆయన సన్నిహితులు ఓదార్చారు.

మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న మినిస్టర్.. పలువురి సంతాపం
Rajesh Sharma
|

Updated on: Nov 19, 2020 | 2:32 PM

Share

Sad situation in Perni Nani House: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఇంట్లో పెను విషాదం నెలకొంది. మంత్రికి మాతృ వియోగం జరగడమే అందుకు కారణం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాని తల్లి నాగేశ్వరమ్మ (82) గురువారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా చాలా కాలంగా చికిత్స పొందుతున్న నాగేశ్వరమ్మ కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు.

నయమైందన్న నమ్మకంతో రెండు రోజుల క్రితం ఆంధ్రా ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపారు. అయితే గురువారం తెల్లవారుజామున నాగేశ్వరమ్మకు తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో ఆమెను మళ్ళీ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

మంత్రి పేర్ని నానికి మాతృవియోగం కలుగడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు సంతాపం ప్రకటించారు. నానికి ధైర్యం చెప్పారు. తమ మాతృమూర్తి అంతిమ సంస్కారాల ఏర్పాట్లలో వున్న మంత్రి పేర్ని నానిని కలిసిన ఆయన అనుచరులు ఆయనకు సానుభూతి ప్రకటించారు.

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో