AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన దారుణం.. అమ్మాకానికి అమ్మాయి.. ఏడు నెలల్లో ఏడు సార్లు..!

మానవ అక్రమ రవాణా కేసులో ఛత్తీస్‌గడ్‌కు చెందిన 18 ఏళ్ల బాలికను ఏడు నెలల్లో ఏడుసార్లు అపహారణకు గురైంది. ఆ అవ‌మానం భ‌రించ‌లేని ఆమె చివ‌ర‌కు బలవన్మరణానికి పాల్పడింది.

ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన దారుణం.. అమ్మాకానికి అమ్మాయి.. ఏడు నెలల్లో ఏడు సార్లు..!
Balaraju Goud
|

Updated on: Feb 09, 2021 | 12:58 PM

Share

Girl Trafficked : ఛత్తీస్‌గడ్‌లో దారుణం వెలుగుచూసింది. మానవ అక్రమ రవాణా కేసులో ఛత్తీస్‌గడ్‌కు చెందిన 18 ఏళ్ల బాలికను ఏడు నెలల్లో ఏడుసార్లు అపహారణకు గురైంది. ఆ అవ‌మానం భ‌రించ‌లేని ఆమె చివ‌ర‌కు బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మూడు రాష్ట్రాల పోలీసుల మూకుమ్మడి దర్యాప్తులో ఆసక్తి విషయాలు బయటపడ్డాయి. టీనేజ్‌ అమ్మాయిని అపహరించిన యువకులు ఆమె తల్లిదండ్రులను పిలిచి డబ్బు డిమాండ్ చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని జ‌ష్‌పూర్‌కు చెందిన ఓ 18 ఏళ్ల యువ‌తి త‌న తండ్రికి వ్యవ‌సాయ ప‌నుల్లో సాయంగా ఉంటుంది. అయితే, ఆ యువ‌తి వ్యవ‌సాయ ప‌నులు చేయ‌డం ఇష్టప‌డ‌ని బంధువు ఒక‌రు మంచి ఉపాధి చూపిస్తాన‌ని చెప్పి మ‌ధ్యప్రదేశ్‌లోని ఛ‌త్తార్‌పూర్‌కు తీసుకెళ్లింది. అక్కడ నుంచి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప‌ర్లు ఆ యువ‌తి కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేశారు. డ‌బ్వులు ఇవ్వక‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు ద‌ర్యాప్తు చేప‌ట్టి కిడ్నాప‌ర్లు అయిన ఇద్దరు దంప‌తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. యువ‌తిని కిడ్నాప్ చేసింది ఆమెను ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి తీసుకెళ్లిన దంప‌తులే అని విచార‌ణ‌లో తేలింది.

ఆ త‌ర్వాత యువ‌తిని ఏడు నెల‌ల క్రితం ఛతర్‌పూర్‌లోని స్థానికుడు కల్లు రాయ్‌క్వార్‌కు బాలికను రూ .20,000 కు అమ్మారు. బాలికను చివరిగా కొనుగోలు చేసిన వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లోని లలిత్పూర్ కు చెందిన స్థానికుడు సంతోష్ కుష్వా 70,000 రూపాయలు కొనుగోలు చేశాడు. మాన‌సిక విక‌లాంగుడు అయిన త‌న కుమారుడు బాబ్లూ కుష్వాకు యువ‌తితో బ‌ల‌వంతంగా పెళ్లి జ‌రిపించాడు సంతోష్ కుష్వా. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానం భ‌రించ‌లేక గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో లలిత్‌పూర్‌లో ఆమె ఆత్మహ‌త్య చేసుకుందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అయితే, ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చివరగా పెళ్లి చేసుకున్న యువకుడు బాబ్లూ కుస్వా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల నుండి ఎక్కువ మంది బాలికలను ఇతర రాష్ట్రాల్లోని నిందితులు అక్రమ రవాణా చేస్తున్నారని ఛతర్‌పూర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ దిశగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Read Also… పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్‏కు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్ చేసిన మాధురీ..

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!