Bus Accident: అంతా నిద్రలో ఉండగా.. వంతెనపై నుంచి వాగులో బోల్తా పడిన బస్సు! ఆ తర్వాత
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో అమాంతం పడిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మంగళూరుకు వెళ్తున్న బస్సు అగసుర్ గ్రామంలో వంతెనపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అదుపు తప్పి వంతెన కింద ఉన్న వాగులో పడిపోయింది..

కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో సోమవారం (జులై 21) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కాలువలో అమాంతం పడిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మంగళూరుకు వెళ్తున్న బస్సు అగసుర్ గ్రామంలో వంతెనపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అదుపు తప్పి వంతెన కింద ఉన్న వాగులో పడిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హుబ్బళ్లికి చెందిన వినాయక్ షిండేగా గుర్తించారు. మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును బయటకు లాగారు. ఉత్తర కన్నడ జిల్లాలోని అగసూర్ గ్రామం సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రైవేట్ బస్సు మంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. రోడ్డుపై గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి.. వంతెనను ఢీ కొట్టాడు. వంతెన గోడ కూలడంతో.. బస్సు కాలువలో బోల్తా పడింది.
స్థానికులు, పోలీసు బృందాల సహాయంతో బస్సులోని ప్రయాణికులను తాళ్ల సాయంతో రక్షించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








