AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ మాజీ సీఎం వి.ఎస్. అచ్యుతానందన్ కన్నుమూత!

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సొమవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచారు. గత నెల 23వ తేదీన ఆయనకు సడన్‌గా గుండె పోటు రావడంతో ఆయన హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి హాస్పిట్‌లోని వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

కేరళ మాజీ సీఎం వి.ఎస్. అచ్యుతానందన్ కన్నుమూత!
V.s. Achuthanandan
Anand T
|

Updated on: Jul 21, 2025 | 4:38 PM

Share

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సొమవారం మధ్యహ్నం తుదిశ్వాస విడిచారు. గత నెల 23వ తేదీన ఆయనకు సడన్‌గా గుండె పోటు రావడంతో ఆయన హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి హాస్పిట్‌లోని వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అచ్యుతానందన్  2006 మే 18 నుండి 2011 మే 14 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1964లో CPI జాతీయ మండలి నుండి తప్పుకున్న 32 మంది నాయకులలో VS కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన CPM వ్యవస్థాపక నాయకులలో ఒకరిగా ఉన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, CPM రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు, LDF కన్వీనర్, ఇటీవల పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్ పదవితో సహా అనేక పదవులను ఆయన నిర్వహించారు. అయితే నాలుగేళ్ల క్రితం గుండెపోటు రావడంతో అప్పటి నుంచి VS క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వి.ఎస్. అచ్యుతానందన్ అలియాస్ వెలికాకత్ శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పుజలోని పున్నప్రలో ఈయన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శంకరన్, అక్కమ్మ. అయితే ఈయన జన్మించిన కొన్ని రోజులకు తల్లిదండ్రులను చనిపోవడంతో.. ఆయన ఏడో తరగతితోనే అతనిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. దీంతో అతని చదువు మానే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1940లలో ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తగా మారారు. పున్నప్ర వాయలార్ పోరాటంతో సహా కేరళ చరిత్రలో భాగమైన అనేక పోరాటాలలో ఆయన పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..