E-Rupi: బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌ లేకుండానే నగదు రహిత చెల్లింపులు.. ‘ఈ-రూపీ’ సిస్టమ్‌కు ఇవాళ ప్రధాని శ్రీకారం

Digital payment system: దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ-రూపిని ప్రారంభించనున్నారు.

E-Rupi: బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌ లేకుండానే నగదు రహిత చెల్లింపులు.. ‘ఈ-రూపీ’ సిస్టమ్‌కు ఇవాళ ప్రధాని శ్రీకారం
Pm Modi To Launch E Rupi
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 02, 2021 | 6:52 AM

PM Modi to launch E – Rupi today: దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ-రూపిని ప్రారంభించనున్నారు. ఎలక్ట్రానిక్ వోచర్ ఆధారిత డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. దాని UPI ప్లాట్‌ఫామ్‌లో, ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య అథారిటీ సహకారంతో దీన్ని రూపొందించారు. ఈ-రూపీ చెల్లింపు సేవ సహాయంతో, వినియోగదారు కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండా వోచర్‌ను రీడీమ్ చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే రూపాయి.. ‘ఈ-రూపీ’ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా.. నగదు రహిత, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఈ-రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో.. అదే ఉద్దేశానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇతర చెల్లింపులకు అది పనికిరాదని తెలిపింది.

ఈ-రూపీ ప్రయోజనం ఏంటీ? ప్రభుత్వం సబ్సిడీల రూపంలో అందించే నగదును పలు సంక్షేమ పథకాలను క్రమంగా ఈ-రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా వృథా, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో ఎరువుల డీలర్లు ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, బస్తాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇకపై ఆ సబ్సిడీని నేరుగా రైతుల మొబైల్‌ ఫోన్లకు ఈ-రూపీ వోచర్ల రూపంలో పంపే అవకాశాలున్నాయి. వారు ఎరువుల డీలర్ల వద్ద వాటిని రిడీమ్‌ చేసుకుని, మిగతా మొత్తం నేరుగా లేదా ఈ-రూపీ వోచర్లను కొనుగోలు చేసేందుకు లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడనుంది.

ఈ-రూపీ ఎలా పనిచేస్తుంది? ఈ-రూపీ అనేది వినియోగదారుల మొబైల్‌ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్సెమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ రూపంలో చేరుతుంది. ఈ-రూపీ అనేది ఎలాంటి ప్లాట్‌ఫాం కాదు. థర్డ్‌ పార్టీ పేమెంట్‌ గేట్‌వే ప్రమేయం ఇందులో ఉండదు. ఈ కోడ్‌ లేదా వోచర్‌ను లబ్ధిదారులు ఎలాంటి కార్డులు, నెట్‌బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌తో సంబంధం లేకుండా నగదుకు బదులుగా వినియోగించుకోవొచ్చు. భారత జాతీయ చెల్లింపుల సాధికార సంస్థ(ఎన్‌పీసీఐ) రూపకల్పన చేసిన ఈ-రూపీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్సెమ్మె్‌స్‌ రూపంలో వచ్చే స్ట్రింగ్‌ వోచర్‌ను సంబంధిత వాణిజ్య, వ్యాపార సంస్థల వద్ద రిడీమ్‌ చేసుకోవచ్చు.

ఈ-రూపీని ఎక్కడ ఉపయోగించవచ్చు? ముఖ్యంగా కోవిడ్‌ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చెల్లింపులకు ఈ విధానం ఉపయోగపడుతుంది. టీకా కోసం ఈ-రూపీని తీసుకుంటే వ్యాక్సిన్‌ కోసం మాత్రమే రిడీమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత మందులు, మాతాశిశు సంరక్షణ పథకం, టీబీ కార్యక్రమంలో డయాగ్నస్టిక్‌,మందులు, ఎరువుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు నగదు,నగదు బదిలీ రూపంలో సబ్సిడీ ఇస్తున్నారు. వీటికి తొలిదశలో ఈ-రూపీని వినియోగించే అవకాశాలున్నాయి.

కార్పొరేట్‌ సంస్థలు కూడా.. కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమానికి, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ-రూపీ వోచర్లను జారీ చేయవచ్చని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు ఈ-రూపీని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని తెలిపింది. అలా ఈ-రూపీని బహుమతిగా ఇచ్చిన వారు.. వోచర్ల వినియోగాన్ని ట్రాక్‌ చేయవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్‌పీసీఐతో ఈ-రూపీ కోసం ఎన్‌పీసీఐతో ఒప్పందం కుదర్చుకున్నాయి.

Read Also…  Tokyo Olympics 2020: కమల్‌ప్రీత్, మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. భారత అథ్లెట్ల నేటి పూర్తి షెడ్యూల్..!