Tokyo Olympics 2020: కమల్‌ప్రీత్, మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్..!

టోక్యో ఒలింపిక్స్ -2020 లో సోమవారం భారతదేశానికి ఎంతో ముఖ్యమైన రోజు. రోజు భారతదేశానికి రెండు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.

Tokyo Olympics 2020: కమల్‌ప్రీత్, మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధం.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్..!
Kamalpreet And Women Hockey Team
Follow us
Venkata Chari

|

Updated on: Aug 02, 2021 | 8:22 AM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ -2020 లో ఆదివారం భారతదేశానికి చారిత్రాత్మక రోజు. పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారత పురుషుల హాకీ జట్టు కూడా 49 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 1972 తర్వాత తొలిసారిగా భారత జట్టు ఒలింపిక్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. సోమవారం కూడా ముఖ్యమైన రోజు కానుంది. డిస్కస్ త్రో ప్లేయర్ కమల్‌ప్రీత్, మహిళల హాకీ జట్టు నుంచి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కమల్‌ప్రీత్ మహిళల విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అలాగే పతకం గెలుస్తుందని భావిస్తున్నారు. మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. వారు గెలిస్తే మొదటిసారి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంటారు.

ఈ రెండింటితో పాటు ఈరోజు షూటింగ్‌లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అథ్లెటిక్స్‌లో మహిళా రన్నర్ ద్యుతీ చంద్ ట్రాక్‌లో నిలబడ్డారు. సోమవారం టోక్యో ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇలా ఉంది.

సోమవారం టోక్యో ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్.. అథ్లెటిక్స్: ఉదయం 7:25: ద్యుతీ చంద్, మహిళల 200 మీటర్ల రన్నింగ్ సాయంత్రం 4:30 నుంచి: కమల్‌ప్రీత్ కౌర్, మహిళల డిస్కస్ త్రో ఫైనల్

హార్స్ రైడింగ్: మధ్యాహ్నం 1:30: ఫవాద్ మీర్జా, జంపింగ్ వ్యక్తిగత క్వాలిఫైయర్ సాయంత్రం 5:15 : వ్యక్తిగత జంపింగ్ ఫైనల్స్ ఈవెంట్

హాకీ: ఉదయం 8:30: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, మహిళల హాకీ క్వార్టర్ ఫైనల్స్

షూటింగ్: ఉదయం 8.00: సంజీవ్ రాజ్‌పుత్-ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ అర్హత మధ్యాహ్నం 1:20: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానం ఫైనల్.

Also Read: Tokyo Olympics: నిద్రలేచింది మహిళా లోకం..టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల కంటే మహిళలకే ఇప్పటివరకూ ఎక్కువ పతకాలు..ఆ లెక్క ఇలా..

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని