Credit Card: మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా.. ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..!

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డు అనేది చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. గతంలో క్రెడిట్‌ కార్డు కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ ప్రస్తుతం అయితే కార్డు..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా.. ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..!
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Aug 02, 2021 | 6:51 AM

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డు అనేది చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. గతంలో క్రెడిట్‌ కార్డు కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ ప్రస్తుతం అయితే కార్డు పొందాలంటే సులభంగా తీసుకునే పద్దతులు వచ్చేశాయి. బ్యాంకులు మరీ ఫోన్‌లు చేస్తూ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నారు. అయితే క్రెడిట్‌ కార్డులపై కూడా పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి బ్యాంకులు. మార్కెట్లో 130 రకాల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. వాటిలో ఏ కార్డు వినియోగిస్తే హోటల్స్‌ రూమ్స్‌ బుకింగ్స్‌లో డిస్కౌంట్లు, రివార్డు పాయిట్లు వస్తాయో..? ఏ కార్డుపై పెట్రోల, డీజిల్‌ డిస్కౌంట్‌ లభిస్తాయని తెలియదు. అయితే వాటిలో మనం తరుచు వాడే 5,6 క్రెడిట్‌ కార్డ్‌లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాంటి విషయాలు తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందితో పాటు క్రెడిట్‌ స్కోర్‌ తగ్గకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే అప్పుడప్పుడు ఏ క్రెడిట్‌ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో కూడా మన మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌లు కూడా వస్తుంటాయి.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇన్ఫినియా: ఎయిర్‌ పోర్ట్‌లలో ప్యాసింజర్‌ కోసం ప్రత్యేక సదుపాయాలు( లాంజ్ యాక్సెస్) ఉంటాయి. వాటిల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. క్లబ్ మారియట్ మెంబర్‌ షిప్‌ లభిస్తోంది

* ఐసీసీఐ బ్యాంక్‌ ప్లాటినం: ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా ఫ్యూయల్‌ సర్‌ ఛార్జీల తగ్గింపు లభిస్తుంది. అలాగే రెస్టారెంట్‌లలో 15 శాతం డిస్కౌంట్‌, ఇతర వాటిల్లో కూడా ఆఫర్లు ఉంటాయి.

* ఎస్బీఐ ఎలైట్‌: ఈ కార్డు ఉండటం వల్ల ప్రయారిటీ పాస్‌ మెంబర్‌ షిప్‌తో పాటు, లాంజ్‌ యాక్సెస్‌, ట్రిడెంట్‌ హోటల్‌ మెంబర్‌ షిప్‌ లభిస్తుంది.

* హెచ్‌ఎస్‌బీసీ వీసా ప్లాటినం: ఈ కార్డుతో అమెజాన్‌ ఓచర్స్‌ లభిస్తుంటాయి. లాంజ్‌ యాక్సెస్‌, విమాన ప్రయాణాల్లో డిస్కౌంట్‌లతో పాటు భోజన సదుపాయం, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ఉంటాయి.

* సిటీ క్యాష్‌ బ్యాక్‌: ఈ కార్డు ఉండటం వల్ల క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాకుండా రెస్టారెంట్‌లలో కూడా డిస్కౌంట్స్‌ ఆఫర్లు పొందవచ్చు.

* యాక్సెస్‌ బ్యాంక్‌ నియో: అమెజాన్‌ ఓచర్స్‌, జోమాటా, పేటీఎం, మింత్రా, బుక్‌ మై షోలలో డిస్కౌంట్‌, ఇంకా ఇతర వాటిల్లో కూడా డిస్కౌంట్‌ లభిస్తుంటుంది.

అయితే క్రెడిట్‌ కార్డులపై వివిధ రకాల బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర కార్డులపై కూడా చాలా రకాల బెనిఫిట్స్‌ ఉంటాయి. వాటికి తగ్గట్లుగా వాడుకుంటే ఎన్నో ఉపయోగాలుంటాయి. కానీ సరైన సమయాల్లో బిల్లులు చెల్లించకపోతే మాత్రం భారీగా పెనాల్టీ పడుతుంది. ఆఫర్లు కూడా తగ్గిపోతుంటాయి.

ఇవీ కూడా చదవండి:

Google: స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఈ ఫోన్‌లలో జీమెయిల్‌, యూట్యూబ్‌ ఇక పని చేయవు..!

LIC Credit Card: ఎల్‌ఐసీ నుంచి క్రెడిట్‌ కార్డులు.. ఎన్నో ప్రయోజనాలు.. రెండు రూపే కార్డుల ఆవిష్కరణ..!