AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్.. విమర్శ కాదంటూనే..

PM Modi: దేశంలో రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించడం ..

PM Modi: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్.. విమర్శ కాదంటూనే..
Modi
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2022 | 2:48 PM

Share

PM Modi: దేశంలో రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించడం లేదంటూనే.. ధరలు తగ్గించే విషయాన్ని రాష్ట్రాలపై నెట్టారు. దేశంలో మరోసారి కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలపైనా స్పందించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని కోరారు. సామాన్యులపై డీజిల్, పెట్రోల్ భారం ఎక్కువగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం గత నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కూడా అభ్యర్థించారు. ఈ రాష్ట్రాన్నీ విమర్శించాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదంటూనే.. పలు రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తూ వ్యాట్ తగ్గించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఇదే సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా కీలక కామెంట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వయోజన జనాభాలో 96 శాతం మంది ఫస్ట్ డోస్, 15 ఏళ్లు పైబడిన 85 శాతం మంది అర్హులు సెకండ్ డోస్ వేసుకున్నారని తెలిపారు. ఇది ప్రతి పౌరుడికి గర్వకారణం అని పేర్కొన్నారు ప్రధాని. ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మెరుగ్గా నిర్వహిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఈ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. పెరుగుతున్న కోవిడ్ కేసులను బట్టి.. కోవిడ్ సవాళ్లను ఇంకా అధిగమించలేదని స్పష్టమవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమయన్వయం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ఉక్రెయిన్ యుద్ధంపై.. ఉక్రెయిన్ యుద్ధం అనేక సవాళ్లను ఎదుర్కొన్న చైన్ సిస్టమ్‌ను ప్రభావితం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. అందువల్ల కో ఆపరేటీవ్ ఫెడరలిజం మరింత ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. ఈ రివ్యూ మీటింగ్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై చర్చించామని ప్రధాని మోదీ అన్నారు. వేడిగాలుల మధ్య పెరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించడానికి అన్ని హాస్పిటల్స్ లో భద్రతా ఆడిట్‌లకు ప్రాధాన్యత పెంచాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. ప్రమాదాల సందర్భంలో ప్రతిస్పందన సమయం కూడా తక్కువగా ఉండాలని సూచించారు.

Also read:

Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

Chandrababu Naidu: విచారణకు హాజరుకాని చంద్రబాబు, బోండా ఉమా.. ఏపీలో మరింత ముదురుతున్న వివాదం..

Andhra Pradesh: బిల్లులు చెల్లించలేదని సచివాలయానికి తాళం.. కాంట్రాక్టర్ నిరసన