AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: ఏంటీ.. ప్రేమలు హీరోయిన్ పేరు మమితా కాదా ..? అసలు ఎలా మారింది..

డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువతలో విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మమితాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది

Mamitha Baiju: ఏంటీ.. ప్రేమలు హీరోయిన్ పేరు మమితా కాదా ..? అసలు ఎలా మారింది..
Mamitha Baiju
Rajitha Chanti
|

Updated on: May 05, 2024 | 1:02 PM

Share

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిన పేరు మమితా బైజు. అసలు తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది. అందం.. అంతకుమించిన చలాకీతనం.. తనదైన నటనతో కుర్రకారు ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇటీవల మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా.. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువతలో విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మమితాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మమితాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. ఇన్నాళ్లు అంతా అనుకుంటున్నట్లు తన పేరు మమితా కాదని తెలిపింది. మమితా అసలు పేరు నమిత అంటూ రియల్ నేమ్ రివీల్ చేసింది. అయితే ఆసుపత్రి సిబ్బంది బర్త్ సర్టిఫికెట్ లో మమితగా నమోదు చేశారని తెలిపింది. స్కూల్లో జాయిన్ అయ్యే సమయానికీ తన పేరును తప్పుగా రాశారని గుర్తించలేదని తెలిపింది. అలాగే మమిత పేరు కాస్త విభిన్నంగా ఉందని.. అందుకే ఆ పేరును మార్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పుకొచ్చింది. మమిత అంటే మలయాళంలో మిఠాయి అని తెలిపింది.

ప్రేమలు సినిమా కంటే ముందు మలయాళంలో చాలా చిత్రాల్లో నటించింది. అంతుకు ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. ఇప్పుడు సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాకు తన కెరీర్ లో 16వ మూవీ అని పేర్కొంది. ఇక ఇటీవలే రెబల్ చిత్రంలో నటించింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా కనిపించారు. అలాగే తనకు తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని.. ఇంకా వాటిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉందని.. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎక్కువగా అల్లు అర్జున్ చిత్రాలు చూసేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వాహనదారులకు బిగ్‌అలర్ట్.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట చేయండి
వాహనదారులకు బిగ్‌అలర్ట్.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు!
గుడ్‌న్యూస్‌.. ఇక పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు!
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి బ్రతిమిలాడింది..
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
రోగిని చితక్కొట్టిన డాక్టర్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు బలి!
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
మీ మొబైల్‌లో డార్క్ మోడ్ బ్యాటరీ లైఫ్ పెంచదా? ఆశ్చర్యపోయే కారణాలు
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కొత్త సంవత్సరంలో వారికి ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో విజయం!
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..
కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్..