Prashant Kishor: 2024లోనే డిసైడ్ చేస్తారు.. ప్రధాని మోదీ కామెంట్స్‌కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్
PM Narendra Modi Vs Prashant Kishor: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక్లలో నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో అధికార పగ్గాలను బీజేపీ తిరిగి సొంతం చేసుకుంది.
Prashant Kishor News: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక్లలో నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో అధికార పగ్గాలను బీజేపీ తిరిగి కైవసం చేసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫైనల్స్‌కు.. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌గా ముందు నుంచే ప్రచారం జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటోంది. 2022 సెమీఫైనల్‌లో నెగ్గాం.. ఇక 2024 ఫైనల్లో కూడా గెలుపు మాదే అంటూ కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం సొంతం చేసుకోవడం తమ సుపరిపాలన, ప్రధాని మోదీ దార్శనికతకు దక్కిన విజయంగా చెప్పుకొస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో గెలిచినందువల్లే 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు రాజకీయ విశ్లేషకులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని నమ్ముతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2024 ఫైనల్ రిజల్ట్‌ను.. 2022 సెమీస్‌లోనే ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిప్పికొట్టారు. భారత్ కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తును నిర్ణయించలేవని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక తీర్పును ప్రజలు 2022లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడించారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు.
తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం తర్వాత గురువారం ప్రధాని మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు ప్రశాంత్ కిషోర్. 2024 లోక్‌సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా 2024 సార్వత్రిక ఫలితాలను నిర్ణయించలేరన్నారు. ఈ విషయం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పార్టీ వైపు అందర్నీ మళ్లించేందుకు ప్రధాని ఓ తెలివైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై నిర్ణయాత్మక సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దని ని, తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో తెలిపారు. దీనిపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు.
Battle for India will be fought and decided in 2024 & not in any state #elections
Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.
Don’t fall or be part of this false narrative.
— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022
Also Read..
Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!