Pralhad Joshi: దేవభూమిలో కమల విజయం వెనుక ప్రహ్లాద్ జోషి.. బీజేపీకి కలిసొచ్చిన కన్నడికుని నాయకత్వ లక్షణాలు..

Uttarakhand BJP: దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ జాక్‌పాట్‌ కొట్టింది. ఊహించినట్లుగానే మరోసారి కాంగ్రెస్‌ను ఖంగుతినిపించి.. కమలంపార్టీ విజయం సాధించింది. తన మార్క్‌ ప్లాన్‌తో సత్తా చాటింది. ప్రధాని మోడీ-అమిత్‌ షా ద్వయం మార్క్‌తో..

Pralhad Joshi: దేవభూమిలో కమల విజయం వెనుక ప్రహ్లాద్ జోషి.. బీజేపీకి కలిసొచ్చిన కన్నడికుని నాయకత్వ లక్షణాలు..
Pralhad Joshi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 11, 2022 | 6:35 PM

దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ(BJP) జాక్‌పాట్‌ కొట్టింది. ఊహించినట్లుగానే మరోసారి కాంగ్రెస్‌ను(Congress) ఖంగుతినిపించి.. కమలంపార్టీ విజయం సాధించింది. తన మార్క్‌ ప్లాన్‌తో సత్తా చాటింది. ప్రధాని మోడీ-అమిత్‌ షా ద్వయం మార్క్‌తో కాంగ్రెస్‌ను కకావికాలం చేసి.. బీజేపీ సత్తా చాటింది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో కాషాయంపార్టీ క్లియర్‌ మెజార్టీ సాధించింది. అత్యధికంగా గర్హ్‌వాల్‌ ప్రాంతంలో బీజేపీ ఎక్కువ స్థానాలతో పట్టు నిలుపుకుంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డింది. బీజేపీ గెలుపు ఆషామాషీగా సాధ్యం కాలేదు. పకడ్బందీగా పార్టీ నిర్మాణంతో పాటే.. అభివృద్ధిపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది కమళదళం. పకడ్బందీగా పార్టీ నిర్మాణంతో పాటే.. అభివృద్ధిపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది కమళదళం. అది ఇక్కడ వీరికి వచ్చింది మామూలు మెజారిటీ కాదు.. మూడింట రెండొంతుల మెజారిటీ. ఇక్కడ బీజేపీకి విజయం నల్లేరుపై నడకే అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలిచి విజయాన్ని పూల బుట్టలో పెట్టి మరీ అందించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ముఖ్యమంత్రుల మార్పు వంటి సమస్యలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్‌కు తనదైన వ్యూహంతో చెక్ పెట్టారు.. ఉత్తరాఖండ్‌ ప్రజల విశ్వసాన్ని మరోసారి బీజేపీ గెలుపుగా మార్చారు. అతను ఎవరో కాదు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఈ మొత్తం ఎన్నికల్లో తన ప్రచార వ్యూహంతో పార్టీకి విక్టరీని అందించారు.

ఈ విజయంతో ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ తొలిసారి పార్టీగా అవతరించింది. సహజంగానే దీని ఘనత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బూత్ లెవల్ వర్కర్ వరకు అందరికీ దక్కుతుంది. అయితే అందులో ముఖ్యమైనది ఉత్తరాఖండ్ బీజేపీ ఇంచార్జ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీసుకున్న నిర్ణయాలు పార్టీ విజయానికి కలిసి వచ్చాయి. ఎన్నికలకు ముందు వరకు, రాష్ట్రంలో అధికార వ్యతిరేక గాలులు, ముఖ్యమంత్రిని తరచుగా మార్చడం గురించి బీజేపీ అనేక ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఓటింగ్ జరిగే వరకు ఈ సమస్యలు ఉత్తరాఖండ్ రాజకీయాల శూన్యంలో మునిగిపోయాయి. ఇందులో ప్రహ్లాద్ జోషిలోని మేనేజ్‌మెంట్ స్కిల్స్, వ్యూహం పార్టీ బాటను సులభతరం చేసింది.

ప్రహ్లాద్ జోషిలోని మేనేజ్‌మెంట్ స్కిల్స్..

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయం సాధించడంలో బీజేపీ ఐక్యత కీలక పాత్ర పోషించింది. నిజానికి ఎన్నికలకు ముందే ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. దీనికి తోడు సరిగ్గా అభ్యర్థుల ప్రకటన తర్వాత బీజేపీలో తిరుగుబాటు బుసలు కొట్టింది. ఇలా చాలా మంది నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అధికార పార్టీకి ఉండే నెగిటివ్ ఓటింగ్‌ను తప్పించుకునేందుకు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. అయితే ఈ తిరుగుబాటును విస్మరించి.. సిద్ధాంతపరమైన కార్యకర్తల బలం కలిగిన బీజేపీకి వారి తిరిగుబాట్లు పెద్దగా దెబ్బ తీయలేక పోయాయి. ఎన్నికల్లో ముఖం చాటేయకుండా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగారు బీజేపీ కార్యకర్తలు. మరోసారి కమలానికి ఓటు వేయాలంటూ ప్రజా క్షేత్రంలోకి దూకారు. ఎంత మంది నాయకులు తిరుగుబాటు చేసిన కమలదళం ముందు చిన్నది మారింది. ఇలా పార్టీని అన్ని స్థాయిల్లో కలిపి ఉంచడంలో ప్రహ్లాద్ జోషి పోషించిన పాత్ర అద్వితీయమైనదని చెప్పవచ్చు. ఓ వైపు పార్టీని సంస్థాగతంగా కట్టుదిట్టం చేస్తూ.. ద్వితియ శ్రేణి నాయకులకు సూచనలు ఇస్తూ ముందుకు దూసుకుపోయారు. ప్రహ్లాద్ జోషి తీసుకున్న నిర్ణయాలు ఉత్తరాఖండ్‌లో విజయం సాధించేందుకు బాటలు వేశాయి.

గెలుపు కోసం స్పెషల్ స్ట్రాటజీ

ప్రహ్లాద్ జోషి.. ట్రబుల్ షూటర్ మాత్రమే కాదు స్ట్రాటజికల్ ప్లానర్ అని పేరుంది. ఆయన వ్యూహం ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయానికి కలిసి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి అసంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషికి ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఎప్పుడైతే ప్రహ్లాద్ జోషి ఎంట్రీ ఇచ్చారు.. ఆయన తన చాణక్య నీతిని ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించి కొత్తవారికి కేటాయించారు. గతంలో జరిగిన పొరపాట్లను రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు.

ఉత్తరాఖండ్‌లో పట్టు కోసం..

ఉత్తరాన హిమవాహినులు.. దక్షిణాన దట్టమైన అడవులతో చూడముచ్చటైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌. ఉత్తరాఖండ్‌ పశ్చిమప్రాంతాన్ని గర్హ్‌వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమో అనీ అంటారు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గాను, అత్యధికంగా గర్హ్‌వాల్‌ ప్రాంతంలో 41 స్థానాలున్నాయి. కుమో ప్రాంతంలో 29 అసెంబ్లీ స్థానాలున్నాయి. పర్యాటక ప్రాంతంలో పాతుకుపోయిన బీజేపీ మరోసారి తన పట్టును నిలుపుకుంది.

చక్రబంధంలో కాంగ్రెస్‌ను బంధించడంలో..

ఎన్నికలకు ముందు బీజేపీని అనేక సవాళ్లు చుట్టుముట్టాయి. ఒకవైపు ముఖ్యమంత్రిని పదే పదే మార్చడంపై బీజేపీ అనేక ప్రశ్నలు ఎదుర్కొంటూనే.. మరోవైపు బీజేపీ ముందు అధికార వ్యతిరేక గాలులను ఎదుర్కొంది. ఇందులో బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌పై నిరంతరం దాడి జరుగుతుండగా.. ఈలోగా ప్రహ్లాద్ జోషి దూకుడుగా కాంగ్రెస్ ముట్టడి ప్రారంభించారు. ఒకవైపు కాంగ్రెస్ జాతీయ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే మరోవైపు కాంగ్రెస్ హయాంలో ఉత్తరాఖండ్‌లో శుక్రవారం ప్రార్థనలు, రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీ ఏర్పాటయ్యాక వాటిని తమ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు ప్రహ్లాద్ జోషి. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పడాన్ని హిందూ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లారు.

జోషి 4 సార్లు ఎంపీగా, కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడిగా…

కర్ణాటక బీజేపీ రాజకీయాల్లో ప్రహ్లాద్ జోషికి పెద్దగా గుర్తింపు లేదు. ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఇప్పటి వరకు 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే సమయంలో అతను 2014 నుంచి 2016 వరకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో బొగ్గు సహా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్‌ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..

G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి.. 

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!