G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి..
G Kishan Reddy Campaigning Magic: గోవాలో బీజేపీ పాగా. అటు ఇటుగా ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్‌ని తిరగరాస్తూ.. వార్ వన్‌సైడ్ అయింది. ఈ గెలుపులో ఆ తెలుగు నేత కృషిని మనం గుర్తుచేసుకోవాల్సిందే..
Goa Assembly Election 2022: అవును ఆ ఒక్కడే తెలుగోడు.. కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి(G Kishan Reddy). గతం కంటే ఘనంగా గోవా ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే కిషన్ రెడ్డి కృషి చాలా ఉంది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కి వెన్నుదన్నుగా నిలిచారు కిషన్ రెడ్డి. గోవా ఎన్నికల సహ ఇంచార్జీగా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. పోస్టర్ల డిజైనింగ్.. ప్రచారం.. రూట్ మ్యాప్స్.. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళ్లే వ్యూహాలు.. ఇలా కిషన్‌రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. గోవా రాష్ట్రంలో స్థానిక సమస్యలను పరిష్కరించి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా స్థానిక ప్రజల్లో విశ్వానం కల్పించేలా చూసుకున్నారు. పర్యాటక మంత్రిగా అక్కడ అనేక కార్యమాలు చేపట్టారు. ఇండియాలోనే టాప్ టూరిస్ట్ స్పాట్ కావడంతో టూరిజం మంత్రిగా ముందుండి బాధ్యతలు చూసుకున్నారు కిషన్ రెడ్డి. ఇక కార్యకర్తలను ఎప్పటికపుడు మోటివేట్ చేయడం.. బీజేపీ వ్యూహాలు.. పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా చూసుకున్నారు.
గోవాఅంటే అక్కడి ప్రజలు చాలా ఫార్వర్డ్‌గా ఉంటారు. పోర్చుగీస్ కాలనీ కావడంతో.. క్రిస్టియానిటీ కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో వారికి తగ్గట్లుగా వ్యూహరచన చేశారు. బాగా పనిచేసే క్రైస్తవ కార్యకర్తలను గుర్తించి.. టికెట్స్ వచ్చేలా చూశారు. దీని ద్వారా క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించింది బీజేపీ. తమ ఓటు చీలకుండా అసంతృప్తులను బుజ్జగించడం.. ప్రత్యామ్నాయాలు చూపడం ద్వారా సక్సెస్ అవడంలో కిషన్ కీరోల్ పోషించారు.
మనోహర్ పారికర్ చనిపోయిన తర్వాత గోవా బీజేపీలో లుకలుకలు కనిపించాయి. సీఎం ప్రమోద్ సావంత్‌పై కొందరు గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో గోవా కో ఇంచార్జీగా పనిచేసిన కిషన్ రెడ్డి.. అక్కడ బీజేపీలో సహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. బీజేపీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఉత్పల్ పారికర్ ప్రభావం పడకుండా.. కార్యకర్తలు, నేతలను కాపాడుకున్నారు. ఇలా కిషన్ రెడ్డి చాణక్యనీతితో గోవాలో పార్టీని గెలిపించారు. తన next టార్గెట్ తెలంగాణే అంటున్నారు.
ఇవి కూడా చదవండి: UP Election Results 2022 LIVE: ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న బీజేపీ.. ఫలితాలపై లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..