PM Narendra Modi: అఖండ విజయంతో హోలీ పండుగ ముందుగానే వచ్చింది.. ఫలితాలపై ప్రధాని మోదీ
Election Result 2022 - PM Modi: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.
Election Result 2022 – PM Modi: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఒక్క పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఇదిలాఉంటే.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ దక్కించుకున్న విజయాన్ని, ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో.. పార్టీ శ్రేణులుద్దేశించి ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఉత్సవం జరుపుకునే రోజు అంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సాహం భారత ప్రజాస్వామిక ఉత్సవం అని పేర్కొన్నారు. తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. ప్రజంలతా అఖండ విజయాన్ని అందించారన్నారు. అఖండ విజయంతో హోలీ పండుగ ముందుగానే వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మార్చి 10నే హోలీ మొదలైందన్నారు. బీజేపీ పనితీరు. పాలనపై విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి, అవినీతి రహిత పాలనకు ప్రజలు పట్టం కట్టారని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో బీజేపీ చరిత్ర సృష్టించిందని.. ఈ విజయంలో కార్యకర్తల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. యూపీలో కుటుంబ పాలన, అవినీతి లేదని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలుస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
ముందుగా కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి జేపీ నడ్డా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కార్యకర్తలు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా అగ్రనేతలందరూ పాల్గొన్నారు.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల వల్లే ఈ విజయం దక్కిందంటూ కొనియాడారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అప్పజెప్పిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. బీజేపీ చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారంటూ ప్రశంసలు కురిపించారు. మణిపూర్‌లో తొలిసారిగా.. ఎవరి సహాయం లేకుండా అధికారం చేపట్టడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొ్నారు. యూపీ, ఉత్తరాఖండ్ లో.. రెండోసారి, గోవాలో హ్యాట్రిక్ విజయం సాధించామని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ విజయాలు వరించాయని వ్యాఖ్యానించారు.
Also Read: