‘ మీ ఖాకీలు వీధుల్లో.. ! అమిత్ షా గారూ ..! మీరెక్కడ ‘ ?
దేశ రాజధానిలో పోలీసులు వీధుల్లోకి వచ్చి.. నిరసన తెలపడం ఈ దేశ అధోగతిని సూచిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశానికి స్వాతంత్య్రం వఛ్చినప్పటినుంచి ఇలా పోలీసులు వీధుల్లోకి ఎక్కడం ఆశ్చర్యంగా ఉందని, దీనిపై హోం మంత్రి అమిత్ షా మౌనంగా ఉండడమేమిటని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణవీర్ సింగ్ సుర్జేవాలా ప్రశ్నించారు. ‘ ఇది బీజేపీ చెబుతున్న న్యూ ఇండియానా ‘ అంటూ ‘… అధికార పార్టీ దేశాన్ని ఇలా మారుస్తుందా ? అని ఆయన […]

దేశ రాజధానిలో పోలీసులు వీధుల్లోకి వచ్చి.. నిరసన తెలపడం ఈ దేశ అధోగతిని సూచిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశానికి స్వాతంత్య్రం వఛ్చినప్పటినుంచి ఇలా పోలీసులు వీధుల్లోకి ఎక్కడం ఆశ్చర్యంగా ఉందని, దీనిపై హోం మంత్రి అమిత్ షా మౌనంగా ఉండడమేమిటని ఈ పార్టీ అధికార ప్రతినిధి రణవీర్ సింగ్ సుర్జేవాలా ప్రశ్నించారు. ‘ ఇది బీజేపీ చెబుతున్న న్యూ ఇండియానా ‘ అంటూ ‘… అధికార పార్టీ దేశాన్ని ఇలా మారుస్తుందా ? అని ఆయన నిలదీశారు. ఢిల్లీ పోలీసులు నేరుగా హోం శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నారని, పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద వారు ప్రొటెస్ట్ చేస్తుంటే హోం మంత్రి, ఆయన శాఖ చోద్యం చూస్తున్నారని సుర్జేవాలా తప్పుపట్టారు.
72 ఏళ్లలో ఇది మరీ దిగజారిపోయిన పరిస్థితి.. దేశ రాజధానిలో ఖాకీల నిరసన ‘ అని ట్వీట్ చేశారు. ఓ వైపు లాయర్లపై కాల్పులు జరుగుతున్నాయని, మరో వైపు పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయని, ఇలాంటప్పుడు ఈ నగర ప్రజలను, శాంతి భద్రతలను ఎవరు పరిరక్షిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
గత శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో లాయర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది ఖాకీలు, అలాగే పలువురు లాయర్లు గాయపడిన సంగతి విదితమే.. ఆ ఘర్షణల సందర్భంలో పలు వాహనాలకు కొందరు నిప్పు పెట్టగా… మరికొందరు కొన్ని వెహికల్స్ ని ధ్వంసం చేశారు. దేశ రాజధానిలోనే ఇంత బీభత్సం జరగడం..సంచలనం రేపింది. చట్టాన్ని న్యాయవాదులు, పోలీసులు కూడా తమ చేతుల్లోకి తీసుకోవడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.