పోలీసులే నిరసనకారులైతే.. రేర్ సీన్ !

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో గత శనివారం పోలీసులకు, లాయర్లకు మధ్య జరిగిన ఘర్షణలు మంగళవారం కొత్త ‘ మలుపు తిరిగాయి ‘. అనేకమంది ఖాకీలు ఇవాళ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి.. నాటి హింసాత్మక ఘటనకు నిరసన తెలిపారు. కొంతమంది పోలీసు యూనిఫామ్ లో ఉండగా.. మరికొందరు సాధారణ దుస్తుల్లో ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. తమ సహచరులపై లాయర్లు జరిపిన దాడిని వారు ఖండించారు. మాకు న్యాయం జరగాలి […]

పోలీసులే నిరసనకారులైతే.. రేర్ సీన్ !
Follow us

|

Updated on: Nov 05, 2019 | 3:58 PM

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో గత శనివారం పోలీసులకు, లాయర్లకు మధ్య జరిగిన ఘర్షణలు మంగళవారం కొత్త ‘ మలుపు తిరిగాయి ‘. అనేకమంది ఖాకీలు ఇవాళ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి.. నాటి హింసాత్మక ఘటనకు నిరసన తెలిపారు. కొంతమంది పోలీసు యూనిఫామ్ లో ఉండగా.. మరికొందరు సాధారణ దుస్తుల్లో ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. తమ సహచరులపై లాయర్లు జరిపిన దాడిని వారు ఖండించారు. మాకు న్యాయం జరగాలి అని ఈ ‘ అసాధారణ నిరసనకారులు ‘ నినాదాలు చేశారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారే న్యాయం చేయలేకపోతే ఇక మా మొరను ఎవరు వింటారని ఓ పోలీసు ప్రశ్నించాడు. మా ఉన్నతాధికారులను కలిసి.. మా ఇబ్బందులను వివరించడానికి వచ్చామని కొంతమంది తెలిపారు.

సాకేత్ కోర్టు బయట ఒక పోలీసు అధికారిపై కొందరు న్యాయవాదులు దాడి చేసి కొడుతున్న వైనం తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. ఇదిలా ఉండగా.. తమ ప్రధాన కార్యాలయం వద్ద గుమి కూడిన పోలీసులను చూసి.. కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కమిషనర్ అమూల్య పట్నాయక్.. మీ ఇబ్బందులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చ్చారు. క్రమశిక్షణ గల సిబ్బందిగా మనం పని చేయాలనీ, ప్రభుత్వం, ప్రజలు కూడా మన నుంచి చట్ట పరిరక్షణను ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది మన బాధ్యత అన్నారు. కాగా-ఈ మధ్య రాజధానిలో జరిగిన కొన్ని ఘటనలను హ్యాండిల్ చేయగలిగామని, పరిస్థితి ఇప్పుడు మెరుగుపడిందని పట్నాయక్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలపై జుడీషియరీ ఎంక్వయిరీ జరుగుతోందని, న్యాయంపై నమ్మకం ఉంచాలని ఆయన తమ ఉద్యోగులకు కూడా సూచించారు.