PM Narendra Modi: మరో కీలక ప్రాజెక్టుకు శంకుస్తాపన చేయనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే..?
Delhi-Dehradun corridor: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ
Delhi-Dehradun corridor: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలోనే ప్రధాని మోదీ.. దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నాని .. ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవాల అనంతరం ఉత్తరాఖండ్ రాజధానిలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారని తెలిపింది. కేంద్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ (ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్ నుండి డెహ్రాడూన్ వరకు) సహా 11 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కాగా.. ఈ ఎకనామిక్ కారిడార్‌తో ఢిల్లీ నుంచి డెహ్రడూన్‌కు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. మూడు గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును రూ.8,300 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వరకు ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు తగ్గుతుంది. దీంతోపాటు ఈ కారిడార్‌ను జంతుసంరక్షణ కోసం చర్యలు తీసుకుంటూ నిర్మించారు. అక్కడక్కడ జంతుసంరక్షణ కోసం అండర్ పాస్‌లు సైతం నిర్మించారు. జంతువుల కోసం ఆసియాలో అతి పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ (12 కి.మీ) కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకే రానుంది.
రూ. 1700 కోట్ల వ్యయంతో యమునా నదిపై నిర్మించిన 120 మెగావాట్ల వైసి జలవిద్యుత్ ప్రాజెక్ట్, అలాగే హిమాలయన్ కల్చర్ సెంటర్‌లో రాష్ట్ర స్థాయి మ్యూజియం, 800 సీట్ల ఆర్ట్ ఆడిటోరియం, లైబ్రరీ, సాంస్కృతిక సమావేశ కేంద్రం కూడా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లేబొరేటరీ (సెంటర్ ఫర్ అరోమాటిక్ ప్లాంట్స్)ను ప్రధాని ప్రజలకు అంకితం చేస్తారు.
Also Read: