Sharad Pawar: UPA ముగిసిన అధ్యాయం.. శరద్ పవార్‌తో భేటీ అనంతరం దీదీ సంచలన వ్యాఖ్యలు….
బీజేపీపై పోరాటంలో కాంగ్రెస్ మౌనంగా ఉంది.. కానీ మేము మౌనంగా కూర్చునే ప్రసక్తి లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ముంబై దాడుల రెండు రోజులలో..
Sharad Pawar – Mamata banerjee: బీజేపీపై పోరాటంలో కాంగ్రెస్ మౌనంగా ఉంది.. కానీ మేము మౌనంగా కూర్చునే ప్రసక్తి లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ముంబై దాడుల రెండు రోజులలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమయంలో మమతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని కలిశారు. ఈ సమావేశం గంటకు పైగా సాగింది. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘బెంగాల్- మహారాష్ట్ర మధ్య పాత సంబంధం ఇప్పటిది కాదన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కోసం మమత చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్‌ను పక్కన పెట్టి ప్రత్యామ్నాయం చూపే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు.
నాయకత్వ సమస్య తర్వాత వస్తుంది..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘మేము ఛాందసవాదానికి వ్యతిరేకంగా.. బిజెపికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. కాంగ్రెస్‌ను విడదీసే ప్రశ్నే లేదన్నారు. కాంగ్రెస్ మౌనంగా కూర్చుంది. ఆ పార్టీ ఏమీ చేయడం లేదు.. మనం కూడా నిశ్శబ్దంగా కూర్చుందామా? యూపీఏ ఇప్పుడు లేదు. ఆప్షన్లు ఇవ్వడం తప్పనిసరి. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు ప్రధానం కాదు. ఇందులో నాయకత్వ అంశం ద్వితీయార్థం.. ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఆ తర్వాత సంగతి అంటూ దాటవేశారు.
బలమైన ప్రతిపక్షం అవసరం: శరద్ పవార్
మమతా బెనర్జీని కలవడంపై శరద్ పవార్ కూడా ట్వీట్ చేశారు. మమతా బెనర్జీని కలవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. పలు అంశాలపై మమతాతో చర్చించామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Pleased to meet Hon’ble CM of West Bengal Smt @MamataOfficial at my Mumbai residence. We Discussed various issues. We agreed upon the need to strengthen the collective efforts and commitment towards safeguarding democratic values and ensuring the betterment of our people. pic.twitter.com/ryrVH2hD6N
— Sharad Pawar (@PawarSpeaks) December 1, 2021
యుపిఏ ముగిసిన అధ్యాయం- మమత
యుపీఏ ఎక్కడ ఉంది ? యుపిఏ ముగిసిన అధ్యాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ముంబైలో సుడిగాలి పర్యటన చేసిన మమత శివసేన , ఎన్సీపీ నేతలతో సమాశం అయ్యారు. ముంబైలో సుడిగాలి పర్యటన చేసిన మమత శివసేన , ఎన్సీపీ నేతలతో సమావేశమయ్యారు. ఫాసిస్ట్ బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పోరాటం చేసే పార్టీలతో కలిసి పనిచేస్తామని , పోరాటం చేయని పార్టీలతో కలబోమని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మమత . విపక్ష కూటమికి శరద్ పవార్ నేతృత్వం వహించాలని కోరారు.
ఇవి కూడా చదవండి: Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..