AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పేదల సొంతింటి కల సాకారం.. ఇంటి తాళాలు స్వయంగా అందజేయనున్న ప్రధాని మోదీ

అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో పేదల కోసం కొత్తగా నిర్మించిన 3,024 ఫ్లాట్స్‌ను పేదలకు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా..

PM Modi: పేదల సొంతింటి కల సాకారం.. ఇంటి తాళాలు స్వయంగా అందజేయనున్న ప్రధాని మోదీ
Pm Narendra Modi
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 02, 2022 | 4:00 PM

Share

అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో పేదల కోసం కొత్తగా నిర్మించిన 3,024 ఫ్లాట్స్‌ను పేదలకు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్లాట్స్‌ను అందించనున్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఇన్‌-సీతు రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఈ ఫ్లాట్స్‌ను నిర్మించడం విశేషం.

మొదటి దశలో భాగంగా మొత్తం 3024 ఫ్లాట్ల నిర్మానం పూర్తయింది. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి మొత్తం రూ. 345 కోట్ల ఖర్చు అయింది. ఫ్లోర్‌ టైల్స్‌, సెరామిక్‌ టైల్స్‌, వంట గదిలో ఉదయ్‌పూర్‌ గ్రీన్‌ మార్బల్స్‌ వంటి అధునాత సౌకర్యాలను అందించారు. అంతేకాకుండా ఫ్లాట్స్‌ చుట్టూ కమ్యూనిటీ పార్క్‌లు, ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్స్‌, మురిగి నీటి శుద్ధి కేంద్రం, లిఫ్ట్స్‌, మంచినీటి సరఫరా వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు.

Delhi Ews Flats

ఇవి కూడా చదవండి

‘అందరికీ సొంతింటి కలను నిజం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) ద్వారా 376 జుగ్గీ జోప్రీ మురికివాడల్లో పునరావసం కింద ఈ ఫ్లాట్లను నిర్మించి, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

పేదలకు ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ మొత్తం మూడు ప్రాజెక్టులను చేపడుతోంది. వీటిలో కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌, జైలర్‌వాలా బాగ్‌, కత్‌పుత్లీలో ప్రాజెక్టులను చేపట్టింది. కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు స్లమ్‌ క్లస్టర్లు భూమిహీన్‌, నవజీవన్‌, జవహర్‌ క్యాంపుల్లో దశలవారీగా పునరావసం కల్పించనున్నారు. ఇక ఈడబ్ల్యూఎస్‌ ఫ్లాట్స్‌ ఫేజ్2లో నవజీవన్‌, జవహర్‌ క్యాంపుల పునరవాసం కోసం ఖాళీ చేసిన స్థలాన్ని వినియోగించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..