PM Modi: కాంగ్రెసోళ్లకు నేనంటే ప్రాణం.. నన్ను తలవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు: లోక్‌సభలో ప్రధాని విమర్శలు
Budget Session of Parliament: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో మాట్లాడుతున్నారు.
PM Modi in Parliament: జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) 12 గంటలకు పైగా చర్చ జరిగింది. నేడు లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. బడ్జెట్ సెషన్ మొదటి వారంలో 15 గంటల 17 నిమిషాల పని వ్యవధిని పూర్తిగా ఉపయోగించారు. 100 శాతం సభలు జరిగాయి. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చలో ఇప్పటివరకు 26 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మొత్తం ఏడు గంటల 41 నిమిషాలపాటు చర్చ జరిగింది. ఇందుకోసం సభ మొత్తం 12 గంటల సమయాన్ని నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “కరోనా కాలం తరువాత, ప్రపంచం కొత్త వ్యవస్థల వైపు వేగంగా కదులుతోందని అన్నారు. ఇది ఒక మలుపని, భారతదేశం ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పిలిపునిచ్చారు.
పేదలు కూడా మిలియనీర్ల కేటగిరీలో చేరారు.. పేదలు కూడా లక్షపధికారుల వర్గంలోకి వచ్చారని ప్రధాని మోదీ అన్నారు. పేదల సంతోషమే దేశానికి బలాన్ని ఇస్తుంది. పేదల ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. టాయిలెట్ ఉంది. నిరుపేద తల్లి పొయ్యి పొగ నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై విరుచుకపడిన మోదీ.. లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన విషయాన్ని బోధకులు మరిచిపోయారంటూ రాహుల్‌పై మండిపడ్డారు. కొంతమంది మాత్రం మేల్కొలపడానికి అస్సలు ఇష్టపడరని విమర్శించారు.
ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ అహంకారం పోలే.. ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ దురహంకారం వీడలేదు. యూపీ, బీహార్, గుజరాత్ లలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. తమిళనాడులో 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదంటూ ఆరోపించారు. 34 ఏళ్ల క్రితం 1988లో త్రిపురలో అక్కడి ప్రజలు చివరిసారిగా కాంగ్రెస్‌కు ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. యూపీ, గుజరాత్, బీహార్‌లో చివరిసారిగా 37 సంవత్సరాల క్రితం 1985లో కాంగ్రెస్‌కు ఓటు వేశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ ప్రజలు చివరిసారిగా 1972లో మిమ్మల్ని ఇష్టపడ్డారంటూ విమర్శించారు.
కాంగ్రెస్‌కు నేనంటే ప్రాణం.. కాంగ్రెస్‌కు నేనంటే ప్రాణం అని, మోదీ లేకుండా వారు ఒక్క క్షణం కూడా జీవించలేరని విమర్శించారు. కరోనా సమయంలో కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించిందని ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేసింది వారేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: UP Assembly Elections 2022: యూపీ ఓటర్లు ఎవరి వైపు..? టీవీ9 భారత్‌వర్ష్ ఒపీనియన్ పోల్ ఏం చెబుతోంది?