PM Modi: బీజేపీ అధికారంలోకి వచ్చాకే హింసకు ఫుల్‌స్టాప్ పడింది.. త్రిపుర ఎన్నికల ప్రచారంలో మోదీ.
బీజేపీ అధికారంలోకి వచ్చాకే త్రిపురలో హింసకు ఫుల్‌స్టాప్ పడిందన్నారు ప్రధాని మోదీ. దలై జిల్లా అంబసలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డ తరువాత త్రిపుర అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందని...

బీజేపీ అధికారంలోకి వచ్చాకే త్రిపురలో హింసకు ఫుల్‌స్టాప్ పడిందన్నారు ప్రధాని మోదీ. దలై జిల్లా అంబసలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డ తరువాత త్రిపుర అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందని అన్నారు. మరోసారి త్రిపురలో బీజేపీ అధికారం లోకి వస్తుందని జోస్యం చెప్పారు మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతోందని అన్నారు మోదీ. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర లభిస్తోందని అన్నారు.
త్రిపురలో కాంగ్రెస్ , లెఫ్ట్ పాలనలో హింస తప్ప అభివృద్ది జరగలేదని ప్రధాని విమర్శించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే ఈనెల 16వ తేదీన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ , కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొందిఉంది. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించి మార్చి 2వ తేదీన ఫలితాలు వెల్లడించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రిపురలో ఓ కొత్త పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక గిరిజన రాష్ట్రం నినాదంతో ఏర్పడ్డ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. త్రిపుర రాజకుటుంబీకుడు ప్రద్యోత్ నేతృత్వంలో ఏర్పడ్డ పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తిప్రా గిరిజన రాష్ట్రం నినాదంతో ఈ పార్టీ రంగం లోకి దిగింది. మరి త్రిపురాలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందో తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..